తమిళ స్టార్ హీరో విజయ్ గురించి తేలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అటు తమిళ్, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. విజయ్, విజయ్ సేతుపతి కలిస్ నటించిన సినిమా మాస్టర్. ఈ సినిమా 2021లో విడుదలైన తెలుగు సినిమాలో ఒక్కటి. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాని ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగులో విడుదల చేశారు.

ఈ సినిమాలో విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా 2020 విడుదలకావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ జనవరి 13, 2021న తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషాల్లో రిలీజ్ చేశారు. అంతేకాక.. మాస్టర్ సినిమా జనవరి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తరువాత విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా తమిళంలో సోలో రిలీజ్, అక్కడ విజయ్ పెద్ద స్టార్ కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తాయి. కానీ.. టాలీవూడ్ లో ఆల్రెడీ రవితేజ “క్రాక్” బంపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా మాస్టర్” ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకోవడం అనేది కష్టమే  చెప్పాలి. అలాంటిది  ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకొని కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతోమ్ విజయ్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మరోసారి సొంతం చేసుకున్నారు. ఇక అప్పటి వరకు డబ్బింగ్ సినిమాలను చేసిన విజయ్ మొదటి సారి తెలుగులో సినిమాను చేస్తున్నారు. చూడాలి మరి ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: