ఇటీవల కాలంలో ఏదైనా భాషలో ఏదైనా సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే ఇతర భాషల మేకర్స్ ఆ సినిమా పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దాన్ని తమ ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించాలని వారు భావిస్తు ఉంటారు. ఈ నేపధ్యంలోనే ఇప్పటిదాకా ఎంతోమంది సినిమా నిర్మాతలు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను తమ భాషలలో చేసి భారీ వసూళ్లను సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు సైతం ఇతర భాషలలో వచ్చే సినిమాలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు.

ఆ విధంగా ఈ సంవత్సరం చాలా సినిమాలు పరభాష నుంచి తీసుకు వచ్చి మన నటీనటులతో సినిమాలుగా చేసి వాటి ద్వారా సూపర్ హిట్ అందుకొని మంచి వసూళ్లను కూడా సాధించుకున్నారు. అయితే తమిళ నాట సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని మాత్రం తెలుగులో ఎందుకో తెరకెక్కించుకుకోలేకపోయారు మన నిర్మాతలు. ఎక్కడ మిస్ అయిందో తెలియదు కానీ మన నిర్మాతలు మాత్రం విక్రమ్ వేద అనే చిత్రాన్ని తెలుగులో చేయాలని అనుకున్న ప్రతిసారి ఎందుకో అది వర్కవుట్ కాలేదు. 

విజయ్ సేతుపతి మాధవన్ హీరోలుగా నటించిన ఈ సినిమా తమిళ నాట భారీ రికార్డులను సృష్టించగా తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్ మరియు రానా హీరోలుగా చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేశారు. వీరు కాకుండా మరికొంత మంది హీరోలు కూడా ఈ సినిమా చేయాలని ప్రయత్నాలు చేయగా ఇప్పటిదాకా ఆ చిత్రం పట్టాలెక్కలేదు. కానీ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ సేతుపతి చేసిన పాత్రలో హృతిక్ నటిస్తుండగా మరొక పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటం ఈ సినిమా పట్ల భారీ క్రేజ్ ఏర్పడడానికి కారణం అవుతుంది. మరి సౌత్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా నార్త్ లో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: