సినిమా టికెట్ల విషయంపై సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలకు.. వై సీ పీ పార్టీ  రాజకీయ నాయకులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది అని చెప్పవచ్చు.. ఎందుకంటే వీరు సోషల్ మీడియా ద్వారా కేవలం మాటల తూటాలు విసురుకుంటూ ఒకరికొకరు అసభ్యకరంగా మాట్లాడుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సామాన్యులకు కూడా సినిమా చూసే హక్కు ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉండగా.. డబ్బులు ఉన్నవాడు మాత్రమే సినిమా చూస్తాడు.. పేదవాడి కోసం మేము నష్టాల్లో కూరుకుపోలేము కదా అంటూ వర్మ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి. ఇక ఈ విషయంపై చిరంజీవి కూడా గతంలో సీఎంను భేటీ అయి సినిమా టికెట్ల విషయంపై పలు రకాల చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే.


ఇక తర్వాత నాగార్జున , మోహన్ బాబు ఇలా ఎంతో మంది తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఇక ఇలా అయితే సినీ ఇండస్ట్రీ లో ఉండే కార్మికుల పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించిన మెగాస్టార్ చిరంజీవి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి చిరంజీవికి అపాయింట్మెంట్  లభించిందట. అందుకే ఆయన ఈరోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకొని అక్కడి నుండి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చిరంజీవి వెళ్లనున్నట్లు సమాచారం .

గత కొన్ని నెలల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ల ధరల విషయంలో ధరల తగ్గింపు అనేది చాలా వివాదాస్పదంగా మారింది. ఇక ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఉండే ఏ ఒక్క పెద్ద కూడా జగన్ మోహన్ రెడ్డి ని వెళ్లి నేరుగా కలవలేదు. మొన్నా మధ్య నాగార్జున వెళ్లి జగన్ ను  కలిసినప్పటికీ కేవలం వాళ్ళు వ్యక్తిగత విషయాలను చర్చించుకోవడం కోసం మాత్రమే భేటీ అయినట్లు తెలుస్తోంది. కానీ నేడు టికెట్ల విషయంపై ఏదో ఒకటి తేల్చాలని నేరుగా చిరంజీవి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్తున్నారు. ఇకపోతే జగన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తించడం లేదు అన్న విమర్శలు కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు. ఇక అందుకే నేరుగా జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి చిరంజీవి విజయవాడ చేరుకోబోతున్నారు. కనీసం చిరంజీవి అయినా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: