పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల కు మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. జల్సా సినిమాతో మొదలైన వీరిద్దరి ప్రయాణం ఆ తర్వాత ఎంతో మంచి స్నేహంగా మారింది. ఫ్రెండ్షిప్ కూడా ఆ స్థాయిలో కొనసాగుతోంది. పవన్ కి సంబంధించిన ప్రతి సినిమా నిర్ణయం వెనకాల తప్పకుండా త్రివిక్రమ్ హస్తం ఉంటుంది. ఆ విధంగా ఆయన కెరియర్ కు ఎంతో ఉపయోగపడుతున్న త్రివిక్రమ్ కు పవన్ మనసులో ఎప్పుడు ఒక మంచి స్థానం ఉంటుంది అని చెప్పాలి.

ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను అందించిన విషయం తెలిసిందే. మలయాళంలో తెరకెక్కిన అయ్యప్పనం కోషియం చిత్రానికి ఇది రీమేక్ కాగా ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులను సృష్టించింది. త్రివిక్రమ్ అన్ని ముందుండి ఈ సినిమా ను నడిపించాడు. డైరెక్టర్ గా ఆయన చేయలేకపోయిన ఈ అవకాశాన్ని ఓ యువ దర్శకుడికి ఇవ్వడం విశేషం. అంతేకాకుండా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఆయన బిజీ కావడానికి కారణం కూడా ఆయనే.

ఈ తరుణంలో ఆయనకు అన్ని రకాలుగా సలహాలు ఇస్తుంది త్రివిక్రమే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాలో నటించమని సలహా ఇచ్చింది కూడా ఆయననట. అలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ను విజయవంతం చేసి అందులో ప్రధాన భూమికను త్రివిక్రమ్ తీసుకోగా తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం పై రచయిత ఎం.వి.ఆర్ రాసిన నేతాజీ పుస్తక సమీక్ష హైదరాబాదులో జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ త్రివిక్రమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలి అని ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూద్దాం. త్రివిక్రమ్ ఇప్పుడు పూర్తిగా మహేష్ సినిమాకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. పవన్ కూడా తను చేస్తున్న సినిమాలపై దృష్టి పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: