టాలీవుడ్ లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ స్వయంకృషితో ఒక సాదారణ నటుడి స్థాయి నుండి అగ్రహీరో స్థాయికి ఎదిగాడు. విజయాపజయాలతో సంబంధము లేకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. రవితేజ కెరీర్ లో ఒక్క హిట్ పడింది అంటే.. వరుసగా మూడు ప్లాప్ లు తనను పరీక్షిస్తాయి. గతంలో 2017 లో రాజా ది గ్రేట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు , నేల టికెట్, అమర్ అక్బర్ ఆంథోనీ మరియు డిస్కో రాజాలు వరుసగా ప్లాప్ లు వచ్చాయి.

ఇక రవితేజ కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా భీభత్సమైన హిట్ ను సాధించి రవితేజ కెరీర్ కు మళ్ళీ ఊపును తెచ్చింది. అంతకు ముందు బలుపు మరియు పవర్ సినిమాలు తీసిన డైరెక్టర్ గోపిచంద్ అని తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎన్నో అంచనాలతో వచ్చిన ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు కూడా ఘోరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా గత సంవత్సరంలోనే విడుదల అయ్యాయి. ఆ తర్వాత 2022 చివరిలో విడుదలైన మరో చిత్రం ధమాకా... నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల కలెక్షన్స్ లను సాధించి రవితేజ కు మళ్ళీ ఊపిరి పోసింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ మసాలా చిత్రం వాల్తేరు వీరయ్య లో ఒక కీలక పాత్రలో నటించి రవితేజ మెప్పించాడు. ఈ సినిమా సైతం 200 కోట్ల మైలు రాయిని అందుకుని రికార్డు సృష్టించింది. అలా రవితేజకు ఆరుసగా రెండు హిట్లు దక్కాయి. ఇప్పుడు రవితేజ లేటెస్ట్ మూవీ "రావణాసుర" చిత్రీకరణ జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరి రవితేజ తన కెరీర్ లో హ్యాట్రిక్ ను అందుకుని తన స్టామినాను మరింత పెంచుకుంటాడా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: