నాని పోయిన సంవత్సరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించి ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్ లో అలరించ లేక పోయాడు. అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరాశపరచిన నాని ఈ సంవత్సరం తాజాగా దసరా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 30 వ తేదీన భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషతో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో కూడా విడుదల అయింది. 

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్ లకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు లాంగ్ రన్ లో వచ్చే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: