యావత్ సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆది పురుష్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అయితాయా అని ఎప్పుడు బుక్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ టికెట్స్ ని తెలంగాణలో ఉన్న అనాధ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు మరియు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా 10000 టికెట్స్ పంపిణీ చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది.

 ఇక ఈ ప్రకటన విన్న తర్వాత సినీ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పదివేల హిందీ టికెట్స్ కొనుగోలు చేసి అనాధ పిల్లలకు ఉచితంగా ఇస్తున్నట్టుగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. గతేడాది విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.ఇక రణబీర్ కపూర్ మరియు ప్రభాస్ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అంతేకాదు ప్రభాస్ బాలీవుడ్ కి వెళ్ళిన ప్రతిసారి రణబీర్ కపూర్ ని కలుస్తూ ఉంటాడు ప్రభాస్.

 అంతే కాదు వారిద్దరూ కలిసి పార్టీలకు పబ్బులకు కూడా వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు సిరి సంస్థ కూడా రన్బీర్ కపూర్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది.అందుకే ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాడట రణబీర్ కపూర్ .ఇక త్వరలోనే రణబీర్ కపూర్ కూడా రామాయణంలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా నియమన టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్నారట. అందులో రణబీర్ కపూర్ భార్య ఆలియా బట్ సీతగా రావణాసురిగా కేజిఎఫ్ హీరో నటించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: