ఎన్నో విషయాలలో అద్భుతమైన ప్రతిభ చూపించే వ్యక్తులు ఆర్ధిక వ్యవహారాలలో మాత్రం ఫెయిల్ అవుతారు. సంపద కోరుకునే వ్యక్తులు ముందుగా తమకు సంపదను సృష్టించే అవకాశం ఉందా లేదా అన్న ఆలోచన చేయకుండా ధనవంతులు అవ్వాలని ప్రయత్నిస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటారు. 


చాలామందికి అప్పు తీసుకునే డప్పుడు ఉండే ఉత్సాహం అప్పు తీర్చడానికి ఉండదు. చాలామంది అప్పు దొరకడమే అద్భుత అవకాశంగా భావిస్తారు. అందువల్ల ఆర్ధిక విషయాలలో ఏకాగ్రత తప్పి తమకు ఎంత సమర్థత ఉన్నా రాణించాలేరు. దీనినే ఆర్ధిక బాధ్యతా రాహిత్యం అని అంటారు. ఈ లక్షణాలు బాగా చదువుకున్న వారిలోను తెలివైన వారి విషయంలో కూడ కనిపిస్తాయి.


దీనితో సంపన్నులు అవ్వాలి అని కలలు కానివారు ముందుగా తమ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన స్పృహను పెంపొందించుకోవడమే కాకుండా తమ ఆర్ధిక స్థితి నిర్వహణ గురించి ఖచ్చితమైన ఆలోచనలు చేయాలి. ఒక వ్యక్తి నెలకు 50 వేలు ఖర్చు పెట్టాలి అని ఆలోచించినప్పుడు అతడి దగ్గర ఆ మొత్తంలో కనీసం రెండు సంవత్సరాలకు సరిపోయే డబ్బు ఉందో లేదో ఆలోచన చేసుకోవాలి. 


ఈ ఆర్ధిక విషయాల పై నియంత్రణ ఉన్న వ్యక్తి మాత్రమే తన ఆర్ధిక లక్ష్యాలను చేరుకోగలుగుతాడు. ధనవంతులు అవ్వాలి అని కలలు కనేవారు ముందుగా సంపాదనా సంపద ఒకటి కాదు అన్న వాస్తవాన్ని గ్రహించాలి. చేసే పనికి ప్రతిఫలంగా మన చేతికివచ్చే ఆదాయం సంపాదన. మన ఆదాయంలో ఎంత పొదుపు చేయగలమో అదే సంపద. ఒక వ్యక్తి పేదరికాన్ని కానీ సంపదను కానీ నిర్ణయించేది ఆ వ్యక్తి ఆదాయం కాదని అతడి ఆదాయానికి ఖర్చులకు ఉన్న వ్యత్యాసం మాత్రమే అని ఆర్ధిక వేత్తలు అంటూ ఉంటారు. దీనితో వచ్చే ఆదాయం సరిపోలేదు అని బాధపడేకన్నా ఆ ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకునే విషయంలో ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడు అవుతాడు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: