మీరు ఎంత డబ్బు సంపాదించినా దాచుకోలేక పోతున్నారా. ? లేదా దాచుకోవడానికి మీకు మార్గాలు తెలియడం లేదా..? ఇకపై సుదీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం లేదు . ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ పాటించి చూడండి.. మీకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు. మీరు డబ్బు ఎలా ఆదా చేయాలి అనే అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు సలహాలు అందించడం జరిగింది. అందులో కొన్ని టిప్స్ మీకోసం తీసుకొచ్చాము.


1. టైం లిమిట్ పెట్టుకోవడం:
ముందుగా మనం ఏమి కొనాలి అనుకుంటున్నామో  దానిని ఒక లిస్టు రూపంలో తయారు చేసుకోవాలి. ఇక అందుకు తగినట్లుగానే షాపింగ్ చేయడం మంచిది . అంతేకాదు ఎంతసేపు షాపింగ్ చెయ్యాలో కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలోనే వస్తువులు కొనడం వల్ల అనవసరమైన వస్తువుల పైన దృష్టి వెళ్లదు. ఫలితంగా డబ్బు మిగులుతుంది.

2. దీనిని ఒక హాబీలా చేయకూడదు:
షాపింగ్ అనేది ఒక హాబీ లాగా కాకుండా ఒక ఆలోచనతో చేయడం చాలా మంచిది . కొంతమంది షాపింగ్ అంటే ప్రతి ఆదివారం తప్పకుండా ఒక అలవాటుగా చేసుకున్నారు. ఆ వస్తువులు మీకు అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా డబ్బు పెట్టి కొనడం వల్ల డబ్బు వృధా అవుతుందే తప్ప మిగలదు. షాపింగ్ అనేది అలవాటుగా కాకుండా అవసరమనిపిస్తేనే వెళ్లడానికి ప్రయత్నం చేయండి.

3. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనడం అలవాటు చేసుకోవాలి..
ఏదైనా వస్తువు ధర అధికం అనుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువులను కొని ఉపయోగించడం చాలా మంచిది. వీటి వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది అని పలువురు నిపుణులు చెబుతున్నారు..

చూశారు కదా..! ఇప్పుడు వచ్చిన ఈ టిప్స్ పాటించి చూడండి..తప్పకుండా డబ్బు ఆదా చేయడం మీకు అలవాటుగా మారిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో మీరు దాచిన ఈ కొంత డబ్బు చాలా పెద్దదిగా అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: