టాలీవుడ్ చేసిన మొదటి సినిమా దేవదాస్ తో హిట్ సాధిస్తే.. రెండో సినిమా పోకిరితో టాప్ పొజిషన్ సాధించి స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇలియానా. అప్పటి నుంచి ఏడేళ్ల పాటు టాలీవుడ్ ని ఏలేసింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇలియానా పేరు తెర మీద పడితే విజిల్స్ వచ్చేవంటే ఆమె హవా తెలుగు సినిమాల్లో ఎలా నడిచిందో ప్రత్యేకించి చెప్పే అవసరం లేదు.

 


ఇలియానా మళ్లీ టాలీవుడ్ లో అవకాశాలు కావాలని ట్రై చేస్తోంది. కసరత్తులు చేసి సన్నబడుతోంది కూడా. ప్రస్తుతం తనకు డబ్బు కావాలని.. తన డ్రీమ్ నెరవేర్చుకోవటానికి ఇది అత్యవసరమని అంటోంది. గోవా తీరంలో సముద్రానికి అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలనేది తన డ్రీమ్ గా చెబుతోంది. వచ్చే ఏడాదికల్లా ఇల్లు నిర్మించుకోవాలంటే తనకు అవకాశాలు, డబ్బు కావాలని తన పరిచయుస్తులతో చెప్పుకుంటోందట. టాలీవుడ్ లో ఇలియానాకు పూర్తిగా దారులు మూసుకుపోయాయని చెప్పలేం. అమ్మడు స్లిమ్ గా అయితే అవకాశాలు ఇవ్వడానికి రెడీగానే ఉంటారు నిర్మాతలు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేసినా రెండు కోట్లు తీసుకోగలిగిందంటే ఇలియానా క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

 

 

తెలుగులో స్టార్ స్టేటస్ అనుభవించి సడన్ గా టాలీవుడ్ కి బై చెప్పేసి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. బర్ఫీతో విజయం అందుకున్నా స్టార్ హీరోలతో చాన్సులు దక్కలేదు కదా.. గ్లామర్ పాత్రలు కూడా తక్కువగానే వచ్చాయి. ఈలోగా ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెడ్ ఆండ్రూతో డేటింగ్, ఫోటోషూట్ లతో గడిపేసింది. రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ కట్ చేసుకుంది. ఇలియానా స్లిమ్ గా మారితే మరోసారి టాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: