టాలీవుడ్ లో తనదైన విలక్షణ నటనతో అందరినీ మెప్పించిన నటుడు బ్రహ్మాజీ.  హీరోగా, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన బ్రహ్మాజీ తాను నటుడుగా మారడానికి ఓ బలమైన సంఘటనే కారణం అని అన్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్రహ్మాజీ మా నాన్నగారు వృత్తిరిత్యా తహశీల్దార్ గా పనిచేసేవారు. ఆ సమయంలో డిప్యూటి కలెక్టర్ గా సోమయాజులు పనిచేసేవారు. అప్పట్లో అంటే చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడిని అన్నారు.   శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులుకు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు.

 

'శంకరాభరణం' విజయాన్ని సాధించడంతో, ఏలూరులో ఆయనకి సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఆ వ్యవహారాలు మా నాన్నగారు దగ్గరుండి చూసేవారు. అప్పటికే మా చుట్టాలతో కలిసి నేను ఆ సినిమాను 12 సార్లు చూశాను. సోమయాజులుగారు వస్తే అందరూ ఆయనను ఒక దేవుడిలా చూస్తున్నారు .. ఆయన పాదాలకి నమస్కారాలు చేస్తున్నారు.  గౌరవ మర్యాదలు చూసిన తరువాతే, నటుడిగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను.  సినిమాల్లో నటిస్తే మంచి గుర్తింపు వస్తుందని.. సెలబ్రెటీ కావొచ్చు అని అభిప్రాయం అప్పట్లో నాలోనాటుకు పోయింది.

 

మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండేళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఎం. ఎ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది. మేమిద్దరం రూమ్ మెట్స్ గా కొంత కాలం ఉన్నాం. కృష్ణవంశి తెరకెక్కించిన ‘ నిన్నే పెళ్లాడుతా’ మంచి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత సింధూరం సినిమాలో హీరోగా నా కెరీర్ ఓ రేంజ్ కి వెళ్లింది.  తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: