‘సినిమా వాళ్లు నాకు క్లోజ్.. నేనెంత చెప్తే అంత.. ఆ క్యారెక్టర్ ఫస్ట్ నాకే వచ్చింది..’ 1993 లో వచ్చిన మనీ సినిమాలో తనికెళ్ల భరణి క్యారెక్టర్ ఇదే. ఇలాంటి వాళ్లు అక్కడక్కడా ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం తాను నటుడినే అని చెప్పుకుంటున్న శ్రీరామోజు సునిషిత్ అనే వ్యక్తి ఇచ్చిన (చేయించుకున్న అనాలేమో..) ఇంటర్వ్యూ చూస్తుంటే తనికెళ్ల భరణి క్యారెక్టర్ గుర్తురాక మానదు. ఈ ఇంటర్వ్యూలో తను చెప్పే మాటలు వింటే సగటు సినీ ప్రేక్షకుడికి కామెడీగా అనిపిస్తాయే కానీ.. ఏ దశలోనూ నిజం అనిపించవు.

 

 

రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో హీరోగా సుకుమార్ తననే తీసుకున్నాడట. సుకుమార్ తనతో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాక.. అల్లు అరవింద్, రామ్ చరణ్ ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ తమకు వదిలేయాలని అడిగితే.. సరే అని ఇచ్చేసాడట. ఆ విధంగా రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడని చెప్తున్నాడు. వన్ నేనొక్కడినే సినిమా మహేశ్ తో పాటు సుకుమార్ కెరీర్ లో మోస్ట్ టిపికల్ సబ్జెక్ట్. సినిమా ఫ్లాప్ అయినా సుకుమార్ టేకింగ్ కు, మహేశ్ ధైర్యానికి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో కూడా సుకుమార్ తనపై కొన్ని సీన్లు తీశాక కాన్సెప్ట్ తెలుసుకుని ఆ క్యారెక్టర్ వదిలేయాలని మహేశ్ కోరాడట. అందుకని త్యాగం చేసి ఇచ్చేశాడట.

 

 

బాహుబలి సినిమాలో రెండు నిముషాల బిట్ పాడానని కూడా చెప్తున్నాడు. ఏ పాట పాడారని యాంకర్ అడిగితే గుర్తు లేదని అంటున్నాడు. ఇలాంటి విచిత్రాలెన్నో ఆ ఇంటర్వ్యూలో ఉన్నాయి. కానీ సదరు వ్యక్తిని ఎవరూ ఏ సినిమాలో కూడా చూసి ఉండరు. మరి ఈ ఇంటర్వ్యూ కథేంటో ఎవరికీ అర్ధం కానిది. ఈ ఇంటర్వ్యూని ఎక్కువ మంది చూస్తున్నారు కూడా. మరి ఇందులో నిజాలేంటో వాళ్లే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: