యాక్షన్ ఫ్రాక్షన్ స్టోరీస్ తో బాక్సాఫీసు దగ్గర సింహా గర్జనలు చేపించి 100 కోట్ల డైరెక్టర్ గా వసూళ్ల వేటలో ముందున్నాడు. కమర్షియల్ మూవీలలో తనకు సాటి ఎవ్వరు లేరంటూ దూసుకుపోతున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్ మూవీస్ అంటే బాక్సాఫీసుకు ఊపు వస్తుంది. కల్లెక్షన్స్ కు స్పీడ్ వస్తుంది. ఈయన చేసే సినిమాలతో స్టార్ హీరోలందరికీ ఎనర్జీ వస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీస్ తో హీరోలకి మంచి యాక్షన్ మూవీ తమ ఖాతాలలో పడిపోతోంది. దీంతో వాళ్ళ కెరీర్ లో ఏదన్నా టర్నింగ్ వస్తుందేమో నాని అభిప్రాయపడతారు. అయితే.. బోయపాటి పై ఇంత నమ్మకం పెరగటానికి ఆయన ఎన్నో సినిమాలను తెరకెక్కించలేదు. ఆయన మొదట మూవీ భద్రను తెరకెక్కించినప్పుడే తన అభిమానులకు ఏం కావాలి. ఎలాంటివయితే జనాలు చూస్తారు. ఎక్కడ ఎమోషన్ ను కారి చేయాలి అనే విషయం మొదలులోనే తెలుసుకున్నాడు బోయపాటి శ్రీనివాస్.

 

ఈ సినిమాతో స్టార్ హీరోలకు ఒక ఆప్షన్ అయ్యాడు. బోయపాటి శ్రీను దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన భద్ర సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమాలో రవితేజ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బోయపాటి ఫ్యాక్షన్ స్టోరీలోనే ఒక కొత్త యాంగిల్ లో నిర్మించాడు. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత సురేష్ ప్రొడక్షన్ లో విక్టరీ వెంకటేష్ తో తులసి సినిమా చేశాడు.

 

ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ స్టోరీలో సీరియస్ లుక్ తో వెంకటేష్ కు మంచి ఇమేజ్ వచ్చింది. వెంకటేష్ ను ఫ్యాక్షన్ హీరోగా చూపించిన బోయపాటి.. నందమూరి నటసింహం బాలయ్యతో సింహా సినిమాను తీసుకువెళ్లాడు. దీంతో బాలయ్యకు అభిమానులు ఎక్కువ ఉండటంతో ఫ్యాక్షన్ స్టోరీలో బాలయ్యను చూసి తెగ ఆనందపడ్డారు ఫ్యాన్స్.

 

ఇక ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టింది. మంచి కలెక్షన్స్ తో బాలయ్యకు కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా నిలిచింది. దీంతో ఇతను టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత మల్లి బాలయ్యతోనే లెజెండ్ సినిమాను తీసి టాప్ 5 డైరెక్టర్స్ లో ఒకడిగా చేరాడు. మళ్ళీ ఈయన అల్లుఅర్జున్ తో చేసిన సినిమా సరైనోడు  ఇది బోయపాటి సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఇలా పలు సినిమాలు తన ఇమేజ్ ను చాటుకున్నాడు శ్రీనివాస్ తక్కువ సినిమాలు ఎక్కువ ఫేమ్ ను సంపాదించాడు బోయపాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: