కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చిత్రాలు విజయం సాధించాల్సినంతా సాధించకుండా సగంలోనే ఆగిపోతాయి. అలా అవడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిల్లో రిలీజ్ టైమ్ సరిగ్గా లేకపోవడం కావచ్చు. లేదా స్టార్ హీరోతో చేయాల్సిన సినిమాని చిన్న హీరోతో చేయాల్సి రావడం కావచ్చు. లేక ప్రమొషన్లు సరిగ్గా చేయకపోవడమో అయ్యుండవచ్చు. అయితే నితిన్ నటించిన భీష్మ చిత్రానికి రావాల్సినంత పేరు రాలేదేమో అనిపిస్తుంది.

 


ఛలో సినిమా ద్వారా తనని తాను నిరూపించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల రెండవ చిత్రంగా భీష్మని తెరకెక్కించాడు. సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరిగిన ఈ కథని వెంకీ చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రేక్షకుడికి ఎక్కడ ఏం కావాలో జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ అన్నింటినీ సమపాళ్లలో అందించాడు. అయితే ఈ సినిమాని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేయకపోవడం వల్ల కావాల్సినంత హిట్ కాలేదని టాక్.

 

నిజానికి వెంకీ రాసుకున్న కథ స్టార్ హీరోకి చక్కగా పనిచేస్తుంది. అంతటి స్థాయి ఉన్న కథని నితిన్ హీరోగా కరెక్ట్ గానే బ్యాలన్స్ చేశాడు. హీరోగా అతను ఈ సినిమా ద్వారా మరో మెట్టుకు ఎదిగాడు. కానీ రిలీజ్ టైమ్ గనక మరోటి అయ్యుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనించి ఉండేది. మరో విషయం ఏమిటంటే కథలో యూనివర్సల్ అప్పీల్ ఉండడంతో ఏ మహేష్ బాబుతోనో, పవన్ కళ్యాణ్ తోనో సినిమా చేస్తే మరో రేంజ్ లో ఉండేదని భావిస్తున్నారు.

 


మొత్తానికి భీష్మ చిత్రానికి కావాల్సినంత విజయం రాలేదని అంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: