టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్నారు. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. బాలయ్య సినిమాలు అనగానే చాలా మంది ఆసక్తి చూపించే వారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గింది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయనకు ఇది వరకు ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు లేదని వ్యక్తిత్వంగా ఉండి ఉండవచ్చు గాని సినిమాల పరంగా మాత్రం బాలకృష్ణకు క్రేజ్ లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

ఆయన ఇటీవల నటించిన సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆయన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయింది. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసిన సినిమాల్లో మొదటి భాగం హిట్ అయినా రెండో భాగం మాత్రం ఫ్లాప్ అయింది. అంచనాలకు తగిన విధంగా ఆ సినిమా లేదని బాలకృష్ణ అభిమానులు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కీలక దశలో ఉన్న తరుణంలో కరోనా కారణంగా వాయిదా పడింది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. టాలీవుడ్ లో ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదని అంటున్నారు. ఆయన సినిమాలు ఒకప్పుడు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఫ్లాప్ అవ్వడం తో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే బాలకృష్ణ కాస్త కష్టంగానే సినిమాలు చేస్తున్నారు అనే అభిప్రాయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినపడుతుంది. అందుకే ఆయన సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: