‘అల వైకుంఠపురంలో’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో తర్వాత సినిమా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే టైటిల్ కలిగిన సినిమా బన్నీ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలు తెలుగు ప్రేక్షకులను అల్లు అర్జున్ అభిమానులను ఎంతగానో అలరించాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ సుకుమార్... సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సెన్సేషన్ సృష్టించారు. అదిరిపోయే రెస్పాన్స్ ఈ పోస్టర్ కి వచ్చింది.

 

కాగా ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటిస్తున్నారని టాక్. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్... బన్నీ క్యారెక్టర్ నీ పగ ప్రతీకారమే తిర్చుకోబోయే పాత్రగా డిజైన్ చేసినట్లు, సినిమాకి అదే ఆయువుపట్టు అన్నట్టు పూర్తి రివెంజ్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో బన్నీ భార్యను కొంతమంది దుండగులు హత్య చేస్తారట.

 

వారిపై పగ తీర్చుకునే క్రమంలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడని, ఆ తరువాత దుండగుల భరతం పడతాడని తెలుస్తోంది. బన్నీ- సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమా కావడంతో అంచనాలు అల్లుఅర్జున్ అభిమానులకి ఓ రేంజ్ లో ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలకు మ్యూజిక్ అందించిన డి.ఎస్.పి ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన….అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: