టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా ఉంటుందని మూడు రోజుల క్రితం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాహుబలి సిరీస్ లోని రెండు భాగాలు ఎంతో గొప్ప తెరకెక్కించి, వాటి ద్వారా అత్యద్భుత విజయాలు అందుకుని ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు పొందిన రాజమౌళి, ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల తో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమాని ఎంతో భారీగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన మల్టి స్టారర్ సినిమాని వచ్చే ఏడాది సంక్రాతి పండుగ సందర్భంగా జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. 

IHG

ఇక దాని తరువాత మహేష్ తోనే రాజమౌళి సినిమా ఉండనున్నట్లు స్వయంగా ఆయన నుండే అఫీషియల్ స్టేట్మెంట్ రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆనందం మిన్నంటింది. అయితే ఆ సినిమా ఎలా ఉండబోతోంది, రాజమౌళి తమ సూపర్ స్టార్ కోసం ఎటువంటి కథను సిద్ధం చేసారు అంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్ అప్పుడే ఆలోచనలు మొదలెట్టేసారు. వాస్తవానికి వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ పై కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ, కథనాలు ఏవి కూడా ఇంకా ప్రారంభము కాలేదని, అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్, మహేష్ మూవీ కోసం ఏదయినా స్టోరీ లైన్ సిద్ధం చేద్దామా అని అన్నారని, అయితే అది ఇంకా మొదలు కాలేదని, అతి త్వరలో ఆ పనులు మొదలెడతాం అని రాజమౌళి అన్నారు. 

 

అయితే తాను ఒక సినిమా చేస్తున్నపుడు మరొక సినిమా పనులు మొదలెట్టే అలవాటు లేదని చెప్పిన రాజమౌళి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న కారణంగానే ఆ కథ విషయమై ఆలోచన చేయమని తన తండ్రితో చెప్పానని అన్నారు. అయితే మహేష్ తో రాజమౌళి చేయబోయే జేమ్స్ బ్యాండ్ తరహా సినిమా అని, అలానే ఆ సినిమాకి మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 ని టైటిల్ గా అనుకుంటున్నారని, ఆ సినిమా ఫస్ట్ లుక్ ఇలానే ఉంటుందని ఒక పోస్టర్ నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా అది పూర్తిగా ఫ్యాన్ మేడ్ పిక్చర్ అని, అయితే మహేష్ తో రాజమళి, జేమ్స్ బాండ్ తరహా కథతో సినిమా చేస్తే నిజంగా అది పెద్ద అద్భుతం సృష్టించడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: