టాలీవుడ్ టాప్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్. ఇక ఈ హీరో పై వ‌చ్చిన పెళ్లి వార్త‌లు ఏ హీరోపై ఇంత వ‌ర‌కు రాలేదేమో. కొన్ని నెల‌లు భీమ‌వ‌రం అమ్మాయితో ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని పుకార్లు షికారు చేశాయి. మ‌రికొన్ని రోజులు ఇంకో అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడ‌ని అన్నారు.  ఆ త‌రువాత అనుష్క – ప్ర‌భాస్ మ‌ధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుద‌ర‌డం, ప్ర‌భాస్ త‌న 3 ఏఎమ్ ఫ్రెండ్ అని అనుష్క చెప్ప‌డంతో త్వ‌ర‌లో వీరిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

 

ఇక ఈ వార్త‌ల ‌పై అనుష్క క్లారిటీ ఇచ్చింది. ప్ర‌భాస్ నాకు మంచి మిత్రుడని అంత‌కు మించి మా ఇద్ద‌రి మ‌ధ్య ఏమీ లేద‌ని చెప్ప‌డంతో ఆ త‌రువాత నుంచి మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక‌ని ప్ర‌భాస్‌ వివాహం చేసుకోబోతున్నాడ‌ని మ‌రో వార్త పుట్టుకొచ్చింది. ఇలా ఎవ‌రు ప‌డితే వాళ్ళ‌ను క‌లిపేసి లాక్‌డౌన్ నేప‌థ్యంలో నిహారిక ఇన్ స్టా వేదిక‌గా ఫ్యాన్స్‌తో లైవ్‌లో ముచ్చ‌టించింది. అంతేకాక ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ ప్ర‌భాస్‌తో డేటింగ్‌లో వున్నావ‌ని, పెళ్లి చేసుకోబోతున్నామ‌‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి నిజ‌మేనా అని ఓ అభిమాని ప్ర‌శ్నించ‌గా. అది పుకారే న‌ని నిహారిక తేల్చి పారేసింది.

 

ఈ నేప‌థ్యంలో పెళ్లి పుకార్ల పై విసుగెత్తిన ప్ర‌భాస్ తాజాగా ఆయ‌న స్పందించాడు. `నేను ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి పై విముఖంగా లేను. అయితే అది ఎప్పుడు జరుగుతుంద‌న్న‌ది ఎవ‌రితో జ‌రుగుతుంది వాటి మీద మాత్రం మీకు క్లారిటీ ఇవ్వ‌లేనంటున్నారు. ఆవిష‌యం విన‌గానే ఫ్యాన్స్ కి ఒక్క‌సారిగా  షాక‌య్యింది. ప‌నిలో ప‌నిగా మీడియా పై సెటైర్ వేశాడు. మా ఫ్యామిలీ కంటే నా పెళ్లి గురించి మీడియానే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తోంద‌ని ప్ర‌భాస్ పంచ్ వేయ‌డం అనేది చాలా ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: