అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరపై విభిన్నమైన ప్రేమ కథాచిత్రాన్ని చూపించిన దర్శకుడు హను రాఘవపూడికి సినిమా అవకాశం వచ్చిందట. అందాల రాక్షసి సినిమా తర్వాత నానితొ తెరకెక్కించిన క్రిష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో ఓ మోస్తారు విజయం అందుకున్నాడు. ఆ సినిమా బాగున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా అనంతరం నితిన్ తో తెరకెక్కించిన లై చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.

 

 

అలాగే శర్వానంద్ తో తీసిన పడి పడి లేచే మనసు కూడా పరాజయం పాలైంది. ఈ సినిమాకి శర్వానంద్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారన్న విమర్శ కూడా వచ్చింది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తర్వాత హను రాఘవపూడికి అవకాశం దక్కలేదు. అయితే గత కొన్ని రోజులుగా హను రాఘవపూడికి అవకాశం వచ్చిందన్న వార్త ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొట్టింది. 

 

 

మళయాల నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి సినిమా ఉండనుందని అన్నారు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన దుల్కర్, డైరెక్ట్ గా తెలుగులో హను రాఘవపూడి సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనని అంటున్నారు. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం ఉండనుందట.

 

 

ఇప్పటికే కథా వినిపించడం పూర్తయిందట. కరోనా లాక్డౌన్ పూర్తయిన వెంటనే దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్టు మొదలు పెట్టవచ్చని అంటున్నారు. వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడికి వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో అవకాశం రావడమంటే అదృష్టమనే చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని హను రాఘవపూడు ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో ఉండనుందని సమాచార

మరింత సమాచారం తెలుసుకోండి: