టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి అనేది చాలా మందికి ఒక డ్రీం అనేది వాస్తవం. ఆయన సినిమా కోసం ఎదురు చూసే నిర్మాతలు మనకు కనపడుతూ ఉంటారు. అగ్ర హీరోలలో ఎక్కువగా క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు అనేది వాస్తవం. మహేష్ బాబు సినిమాలు అనగానే చాలా మంది పనులు మానుకుని కూడా చూసే పరిస్థితి ఉంటుంది అని ప్రచారం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయడానికి గానూ అగ్ర దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు ఒక తమిళ సినిమా మీద దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ సినిమాను చేయడానికి గానూ మహేష్ బాబు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. అయితే ఆ సినిమాలో మహేష్ బాబు హీరో కాదు అని ఆ సినిమా కు మహేష్ బాబు విలన్ అనే ప్రచారం జరుగుతుంది. మరి ఆ సినిమాను చేస్తాడా లేదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలుస్తుంది. 

 

అగ్ర దర్శకులు కూడా మహేష్ బాబు తో సినిమా చెయ్యాలని చూస్తున్న తరుణంలో మహేష్ బాబు ఇప్పుడు ఒక సినిమాను నిర్మించాలి అనే ప్రయోగం చేయడానికి ఎంత గానో ఆసక్తి చూపించడం తో ఆ సినిమా ఏంటీ అనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఇప్పుడు. కాగా ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా లుక్ కూడా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: