నందమూరి వంశం ఎటువంటిది. అటువంటి వంశంలో పుట్టి అన్న తారకరాముడి సిసలైన వారసుడిగా ఎదిగిన నట సింహం నందమూరి బాలక్రిష్ణ టాప్ రేంజి హీరో. ఆయన వందకు పైగా సినిమాలు నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. సినీ రంగానికి నందమూరి తారకరామారావు చేసిన సేవలు గొప్పవి. 

 

ఆయన వారసుడిగా సినిమాల్లో నటిస్తూనే బాలయ్య అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. వరదలు, తుఫానులు ఇతర ఇబ్బందులు వచ్చినపుడు కూడా బాలయ్య మిగిలిన హీరోలతో పాటు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి తనవంతుగా ఆదుకున్నారు, ముందుకువచ్చారు.

 

అయితే ఇపుడు బాలయ్య సినీ సీమలో ఒంటరి అయినట్లుగా సీన్ కనిపిస్తోంది. బాలయ్య సాధారణంగా ఇలాంటివి పట్టించుకోరు. ఆయన బోళా మనిషి. ఇట్టే నమ్మేస్తారు. మంచిగా ఉంటే ప్రాణం పెడతారు. బాలయ్యకు ఇండస్ట్రీ నిండా తాను సంపాదించుకున్న అభిమానులు సన్నిహితులు ఉన్నారు, అలాగే తండ్రి తరం నుంచి ఆదరిస్తున్న వారు ఉన్నారు.

 

అయితే బాలయ్య అలా తన గొప్పతనాన్ని చూపించాలనుకోలేదు. అందరితో పాటే తానూ అనుకున్నారు. ఇపుడు అదే బాలయ్యకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గత కొంతకాలంగా బాలయ్యని పక్కన పెడుతున్నారని ఆయన అభిమానులు వాపోతున్నారు. మిగిలిన వారితో పోలిస్తే బాలయ్య ఏ విధంగానూ తీసిపోరు. ఆయన సేవాభావం కూడా గొప్పది. 

 

ఇక రాజకీయ రంగంలో కూడా రెండు మార్లు ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అటువంటి బాలయ్యని సైడ్ చేస్తూ సినిమాలో కొందరు పెద్దలు పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు.దానికి సాక్షిగా బాలయ్య వెల్లగక్కిన బాధ, తనకు సినిమా పరిశ్రమలో ఏం జరుగుతోందా అర్ధం కావడం లేదని చెప్పడమే ఉదాహరణ.

 

బాలయ్య బాధ వెనక ఏముందన్నది ఇపుడు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినీ పెద్దలు చెబుతున్న కారణాలు బాలయ్యని పిలవకపోవడం వంటివి చూస్తూంటే కొందరి పెద్దలు జాగ్రత్తగా తమ వైపునకు సినిమా పరిశ్రమను తిప్పుకుంటున్నారనిపిసోంది. 

 

మరి బాలయ్య తన అవేదనతోనే సరిపెడతారా లేక నిజంగా బయటకు వస్తారా చూడాలి. బయటకు వస్తే ఎలా ఉంటుంది. సినీ రంగంలో పెడధోరణుల పట్ల రగిలిపోతున్న వారు బాలయ్యని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇదంతా కూడా వెండి తెర మీద చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: