టాలీవుడ్ లో చిన్న సినిమా..మీడియం బడ్జెట్ సినిమా..అనేవి ఇప్పుడు అంతగా వినిపించడం లేదు. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత ఎక్కువ శాతం వినిపిస్తున్న మాట భారీ బడ్జెట్ సినిమా ...పాన్ ఇండియా సినిమా అని. భారీ బడ్జెట్ సినిమా అంటే 150 కోట్ల నుండి 200 కోట్ల బడ్జెట్ తో మన ఒక్క తెలుగు భాషలోనే రిలీజ్ చేసేది. పాన్ ఇండియా సినిమా అంటే కనీసం 300 కోట్ల కి పైగానే బడ్జెట్ కేటాయిస్తారు. నాలుగు లేదా అయిదు భాషల్లో రిలీజ్ చేస్తారు. అందుకోసం ఎక్కువ మొత్తం లో రెమ్యూనరేషన్ ఇచ్చి పరభాషా నటులను తీసుకొస్తారు. అందుకు కారణం ఆయా భాషల్లోను సినిమాకి క్రేజ్ వస్తుందన్న అలోచనే.

 

అయితే భారీ బడ్జెట్ సినిమా అయినా పాన్ ఇండియా సినిమా అయినా కథలో బలం ఉంటేనే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ తో పాటు దర్శకులకు మంచి మార్కెట్ వస్తుంది. లేదంటే చేతులు దారుణంగా కాలిపోతాయి. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఉదాహరణలుగా స్టార్స్ నటించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఒక సినిమా సక్సస్ అయినా ఫ్లాప్ అయినా ముందుగా మునిగిపోయోది నిర్మాతే.

 

ఇలా భారీ ఫ్లాప్స్ గా మిగిలిన సినిమాలని నిర్మించిన నిర్మాతలు ఇప్పటివరకు మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించలేదు. అందుకు ఉదాహరణ గతంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో నరసింహుడు సినిమాని చెంగళ వెంకటరావు నిర్మించారు. సమర సింహా రెడ్డి తో భారీ సక్సస్ ని అందుకున్న ఈయనే నరసింహుడు తీసి అప్పుల బాధతో ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఇలాంటి నిర్మాతలు మరికొంతమంది కూడా గతంలో హిట్ సినిమాలు తీసి ఆ తర్వాత తీసిన సినిమాలు భారీ డిజాస్టర్స్ కావడంతో అడ్రస్ లేకుండా పోయారు.

 

ఇప్పుడు కరోనా ని దృష్ఠిలో పెట్టుకొని సినిమాల నిర్మాణంలో ఖచ్చితంగా టాలీవుడ్ లో లెక్కలు మారాల్సిందే..లేదంటే నిర్మాతలకి బీపీలు హార్ట్ ఎటాక్ లు తప్పవని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో గనక సినిమాలు తీసి జాగ్రత్త పడకుండా కక్కుర్తి గా ఆలోచిస్తే మాత్రం ఆ నిర్మాతలు మాదిరిగా ఈ నిర్మాతలు అడ్రస్ లేకుండా పోతారన్న మాట వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: