కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో వ్యవస్థలన్నీ నిలచిపోయాయి. వీటిలో సినీ పరిశ్రమ కూడా ఉంది. అయితే.. అన్ లాక్ లో భాగంగా ఒకొక్క వ్యవస్థను పునరుద్ధరించారు. గతంలోనే సినిమా షూటింగ్స్ కు పర్మిషన్లు వచ్చినా.. షూటింగ్స్ కు వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేదు. ధియేటర్లు ఓపెన్ చేసేందుకూ పర్మిషన్లు రాలేదు. ఇప్పుడు ధియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ.. ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగా ఉంది. ఈ పరిస్థితిని ముందే ఊహించి సినిమాలను రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఓ హాలీవుడ్ సినిమా మాత్రం ఇండియాలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెనెట్’ సినిమా ఇండియాలో విడుదలకు సిద్ధమవుతోంది. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, లాక్ డౌన్ కారణాలతో ఇండియాలో విడుదల కాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఆగష్టు 26న లండన్ లో, సెప్టెంబర్ 3న అమెరికాలో విడుదలైంది. ఇప్పుడు భారత్ లో ధియేటర్లు తెరిచేందుకు పర్మిషన్ రావడంతో విడుదలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే.. సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ.. ఇండియాలో ఏమేరకు ప్రజాదరణ దక్కుతుంతో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కారణం.. ‘టినెట్’ లండన్, అమెరికాల్లో విడుదలైంది కానీ.. ప్రజాదరణ దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ధియేటర్లైతే ఓపెన్ అయ్యాయి కానీ.. ఎక్కడా పదుల సంఖ్యలో తప్ప ప్రేక్షకులు రాని పరిస్థితి నెలకొంది. కొత్త సినిమాలు రాకపోవడం ఒక కారణం.. ప్రజల్లో కరోనా భయం ఉండటం మరో కారణం. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఏపీలో దాదాపు ధియేటర్లు తెరుచుకోలేదు. తెలంగాణలో పర్మిషనే ఇవ్వలేదు. మరి.. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘టినెట్’ ఎప్పుడొస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: