తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు మన జక్కన్న.ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో మన రాజమౌళి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. మళ్ళీ అదే రేంజ్ లో సినిమా తీయాలనే పట్టుదలతో,టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే RRR. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అల్లూరిగా, చెర్రీ... కొమురం భీంగా తారక్ నటిస్తున్నారు.

 ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో పాటుగా, రామ్ చరణ్ టీజర్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా కొమరం భీమ్ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ విడుదల అయి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన ను రాబట్టింది. తాజాగా రామరాజు ఫర్ భీమ్ టీజర్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ సెన్సేషనల్ గా మారింది. ఇప్పటికే 23 మిలియన్ యూ ట్యూబ్ వ్యూస్ తో ఇంకా తన సత్తా చాటుతోంది.ఇక లైక్స్ పరంగా దాదాపు1.1 మిలియన్ లైక్స్ తో రామరాజు ఫర్ భీమ్ టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఒక మిలియన్ లైక్స్ అందుకున్న టీజర్ గా రామరాజు ఫర్ భీమ్ తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డ్ నెలకొల్పింది.

ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కు కూడా ఇన్ని లైక్స్ రాలేదు. రోజులు గడుస్తున్న కొద్ది లైక్స్ పెరుగుతూనే ఉండటం గమనార్హం.అయితే కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో సైతం ఈ వీడియో సంచలనం గా మారింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ టీజర్ మంచి ఆదరణను కనబర్చింది.ఇక ఈ రికార్డ్ తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అంతేకాదు ఎన్టీఆర్ రికార్డ్ ను భవిష్యత్ లో ఏ అగ్ర హీరో బ్రేక్ చేస్తాడు అన్న ఆసక్తి కూడా అందరిలో పెరిగిపోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: