కరోనా పరిస్థితుల్లో సినిమా బడ్జెట్‌పై పెద్ద చర్చే జరుగుతోంది. థియేటర్స్‌ ఓపెన్‌ కావడానికి ఏడు నెలలు పట్టింది. పర్మీషన్‌ ఇచ్చినా రిలీజ్‌ చేయలేని పరిస్థితి. షూటింగ్స్‌ కొన్ని ఇంకా మొదలు కాలేదు. సినిమా ఇండస్ట్రీ వేల కోట్లలోనష్టం చూసింది. ఇలాంటి సిట్యువేషన్‌లో నటీనటులు.. టెక్నీషియన్స్‌ తమ రెమ్యునరేషన్‌లో 20 నుంచి 30 శాతం కోత విధించుకోవాలని సినీ పెద్దలు సూచించారు. అయితే.. ఇలాంటి రిక్వెస్టులను సదరు హీరోయిన్స్‌ పక్కన పెట్టేయడే కాదు.. తమ పారితోషికాలు పెంచేయడం నిర్మాతలకు షాక్‌ ఇచ్చింది.

కోటి తీసుకున్న హీరోయిన్స్‌ రెండు కోట్లపై.. రెండు కోట్లు తీసుకుంటున్న భామలు మూడు కోట్లపై కన్నేస్తారు. ఛలో వంటి హిట్‌తో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన రష్మిక కోటి రూపాయిల హీరోయిన్‌ అనిపించుకోవాలనుకుంది. దీనికి తగ్గట్టే సరిలేరునీకెవ్వరు హిట్‌తో.. ఆ వెంటనే భీష్మ సక్సెస్‌తో క్రేజీ హీరోయిన్‌ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు సెట్స్‌పై ఉండగానే.. పుష్పలో బన్నీతో జత కట్టడం... ఆల్ రెడీ రెమ్యునరేషన్ ఫిక్స్‌ కావడంతో.. పెంచే అవకాశం మిస్ చేసుకుంది రష్మిక.

కరోనా సమయంలో రెమ్యునరేషన్ పెంచిన హీరోయిన్స్‌లో రష్మిక ఒకరు. 'ఆడవాళ్లూ మీకు జోహార్లు 'మూవీలో  శర్వానంద్‌ పక్కన జత కట్టడం కోసం.. రెండు కోట్లు డిమాండ్‌ చేసిందట. ఎట్టకేలకు 25 లక్షలు తగ్గించుకొని కోటి 75 లక్షలు తీసుకుంటోందని టాక్.  సరిలేరునీకెవ్వరుకు కోటి కూడా తీసుకోని రష్మిక రెమ్యునరేషన్ కరోనా సమయంలో డబుల్ చేసి షాక్‌ ఇచ్చింది.

కరోనా సీజన్‌లో కాజల్‌.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి హీరోయిన్స్‌ తమ పారితోషికంలో 20 నుంచి 30 పర్సెంట్‌ కోత విధించుకుంటే.. పూజా హెగ్డే మాత్రం 2 కోట్లు దాటేసింది. అరవిందసమేత వీర రాఘవ నుంచి కంటిన్యూ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరింది. నాలుగు హిట్స్‌ తర్వాత ఈ మోస్ట్‌ వాంటింగ్‌ హీరోయిన్‌ ప్రస్తుతం రెండున్నర కోట్లు ఇస్తేనే డేట్స్‌ ఇస్తానంటోందట. ప్రస్తుతం రాధే శ్యాం.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌ సినిమాలతోపాటు రీసెంట్‌గా సల్మాన్‌ మూవీలో  ఛాన్స్‌ కొట్టేసింది. ఈ బుట్టబొమ్మ ఉండే సినిమాకు క్రేజ్‌ వస్తుంది? లక్కీ హీరోయిన్‌ అనే సెంటిమెంట్‌తో రెండేంటి? మూడు కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: