దర్శకధీర జక్కన్న రాజమౌళి ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం  సినిమాతో బిజి బిజిగా గడుపుతున్నారు..ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ మరియు మహేష్ భట్  కుమార్తె అలియా భట్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు ...
అయితే rrr సినిమాలో అలియాభట్ పాట పాడనుందా..రాజమౌళి అలియాభట్ చేత పాట పాడించనున్నారా .. అలియాభట్ ఏమో హిందీ నటి .. మరి రాజమౌళి చేస్తున్న rrr తెలుగు లో చేస్తున్నారు .రాజమౌళి ప్లాన్ ఏంటి ??

ఈ సినిమాలో ఆలియా భట్‌, రామ్‌చరణ్‌పై ఓ పాట ఉంది. ఈ సాంగ్‌ను ఆలియా భట్‌తో పాడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అయితే తెలుగు, తమిళ భాషల పదాలను ఆమె పలకడం  కష్టం కాబట్టి.. ఆ రెండు భాషల్లో వేరే వాళ్లతో పాడించి.. హిందీలో మాత్రం ఆలియాతో పాడించాలని అనుకుంటున్నారట. బాహుబలి సినిమాలతో బాలీవుడ్‌లోనూ  రాజమౌళి పేరు మారుమోగిపోయింది .. ఇప్పుడు వచ్చే రౌద్రం రణం రుధిరం పై కూడా అంచనాలు భారీగానే  ఉన్నాయి

రౌద్రం రణం రుధిరం (RRR ) అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌కి జంటగా హిందీ నాయిక ఆలియా భట్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాయికగానే కాదు... గాయనిగానూ ప్రతిభ చూపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం .‘ఆర్‌ఆర్‌ఆర్‌ లో ఆమె ఓ పాటను పాడుతున్నారని బాలీవుడ్‌ ఖబర్‌. అయితే... ఇక్కడ ఓ విషయం గమనించాలి. హిందీ వెర్షన్‌ సాంగ్‌ మాత్రమే ఆలియా భట్‌ పాడతారట. తెలుగు వెర్షన్‌లో ఆ పాటను వేరొకరితో పాడిస్తారని టాక్‌.

గతంలో అలియా భట్  కొన్ని హిందీ  చిత్రాలైన  హైవే, హంప్టీ శర్మ కి దుల్హనియా లో పాటలు పాడారామె. RRR
 చిత్రీకరణ విషయానికి వస్తే... ప్రస్తుతం హైదరాబాద్‌లో దర్శకుడు రాజమౌళి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా సినిమాను 2022లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: