మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస సక్సెస్ లతో కొనసాగుతున్న కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భర్తీ ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది.

ఒక మంచి మెసేజ్ తో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ ని అలానే సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు శివ తీస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. చిరంజీవి ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక విద్యార్థి నాయకుడిగా నటించనున్నట్లు టాక్.

ఇకపోతే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కోసం ప్రేక్షకాభిమానులు ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా టీజర్ కొత్త సంవత్సరం రోజున, అదేనండి 2021, జనవరి 1న రిలీజ్ కాబోతున్నట్లు టాక్. అతి త్వరలో టీజర్ కట్ కి సంబదించిన పనులను ఆచార్య యూనిట్ మొదలెట్టనుందని, కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు మెగాస్టార్ పలికే ఒక పవర్ఫుల్ డైలాగ్ టీజర్ లో ఉండనున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్తే అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: