నాగార్జున కెరీర్ లో అత్యంత బిగ్ హిట్ సినిమాల్లో సంతోషం కూడా ఒకటి. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ అక్షయ్ బచ్చు. చాలా మంది బాలనటులు సినిమా ఇండస్ట్రీలో తమ కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ట్ హీరోలుగా చలామణి అయినా వారు ఉన్నారు. అలాగే మంచి గుర్తింపు ఉన్న నటీనటులకు కూడా కొదవేం లేదు. అదే దోవలోకి వస్తాడు అక్షయ్ బచ్చు సైతం. చాలా చిన్న వయసులోనే సంతోషం సినిమాలో అంత పెద్ద స్టార్ హీరో సరసన చాల ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ టర్నింగ్ మూవీ అయినా వర్షం చిత్రంలోనూ ప్రభాస్ కి మేనల్లుడిగా నటించాడు. ఇక అక్షయ్ ఒక తెలుగులోనే కాదు బాలీవుడ్ లో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అలాగే సీరియల్స్ తో పాటు పలు కమెర్షియల్స్ లోను తన ట్యాలెంట్ ఏంటో చూపించాడు.

బాలీవుడ్ లోను హవా

అక్షయ్  సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన  వాంటెడ్ మూవీలో అయేషా టాకియాకు తమ్ముడి పాత్రలో నటించాడు. ఇదే సినిమా మొదట తెలుగులో పోకిరి గా చేయగా, హిందీ లో రీమేక్ చేయబడింది. తెలుగులో ఇలియానా తమ్ముడి పాత్రలో మాస్టర్ భరత్ నటించగా హిందిలో అక్షయ్ నటించాడు. ఈ ఇద్దరి చైల్డ్ ఆర్టిస్టులకు మంచి పేరు తీసుకచ్చింది ఈ సినిమా.

సింగర్ గా సత్తా చాటుతూ..

ఇక ఒక్క నటనలోనే కాదు అక్షయ్ సింగింగ్ లోను తన ప్రావిణ్యం చూపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నటన వైపు కన్నా సింగర్ గా అక్షయ్ కి మంచి కెరీర్ ఉండే అవకాశం ఉంది అంత అద్భుతంగా పాడుతున్నాడు. హిట్ పాటలను తన గొంతులో పలికిస్తూ సామజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు. ఇక మిగతా చైల్డ్ ఆర్టిస్టుల లాగ అక్షయ్ మరి హీరో అవుతాడో లేదంటే తనకు నచ్చిన సింగింగ్ లో రాణిస్తాడో వేచి చూస్తే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: