సంక్రాంతి సందడి ముగిసింది. పందెం కోళ్ళు ఎవరు అన్నది కూడా తేలిపోయింది. రవితేజా క్రాక్ మూవీ సంక్రాంతికి టాప్ పొజిషన్ దక్కించుకుని రారాజుగా నిలిచింది. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మిగిలిన రెండు తెలుగు సినిమాల పరిస్థితి ఏంటి అన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే ఎనర్జటిక్ స్టార్ రామ్  పోతినేని నటించిన రెడ్ మూవీ అయితే టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా కలెక్షన్లకు కొల్లగొడుతోంది అంటున్నాయి బిజినెస్ లెక్కలు. ఈ మూవీ బ్రేక్ ఇవెన్ పాయింట్ కి  దగ్గరలో  ఉందని అంటున్నారు. రెడ్ సినిమా తొలి రోజు కలెక్షన్లే 10 కోట్లు వచ్చాయంటేనే ఈ మూవీ స్టామినా ఏంటో చెప్పింది. ఆ తరువాత డివైడ్ టాక్ ఉన్నా మరో రెండున్న‌ర కోట్లు వసూల్ చేసింది.  ఈ మూవీకి ఇక ఒకటిన్నర  కోట్లు వస్తే చాలు  బ్రేక్ ఇవెన్ దశను దాటేసినట్లే. ఆ మీదట వచ్చేవన్నీ లాభాలే అంటున్నారు. అలా రెడ్ మూవీ ప్రాఫిట్ జోనర్ లోకి వెళ్ళబోతోందిట.

ఇక అల్లుడు అదుర్స్ మూవీని ఫ్లాప్ కింద లెక్కేస్తున్నా కూడా మా లాభాలు మాకు వస్తున్నాయి అంటున్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ మూవీ కూడా పది కోట్ల దాకా వసూల్ చేసింది. నాన్ థియేట్రికల్ రెవిన్యూ మరో 22 కోట్లు. అంటే ఇక మీదట ఒక్క రూపాయి ఈ మూవీకి అదనంగా వచ్చినా కూడా అది లాభం కిందనే లెక్క. సో మొత్తం మీద ఈ మూవీ కూడా సంక్రాంతి రేసులో బతికి బయటపడిందని అంటున్నారు.

నిజానికి ఈ సంక్రాంతిని ప్రత్యేకంగా చూడాలి అంటున్నారు. ఒక వైపు కరోనా వైరస్ భయం ఉంది. జనాలు థియేటర్లకు వస్తారా రారా అన్న డౌట్లు ఉన్నాయి. దానికి తోడు థియేటర్లలో ఫిఫ్టీ పెర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ రూల్ ఉంది. అయినా సరే అన్నింటినీ తట్టుకుని ఈ సినిమాలు బ్రేక్ ఇవెన్ సాధించాయంటే టాలీవుడ్ కళ్ళు తెరిపించాయని కూడా అంటున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం  చేయకుండా టాలీవుడ్ బాక్సుల దుమ్ము దులిపి మరీ మూవీస్ అన్నీ రిలీజ్ చేస్తే పెట్టిన పెట్టుబడులు అయినా వెనక్కి తిరిగి వస్తాయని సంక్రాంతి సందడి తెలియచేసిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: