సాధారణంగా ఎవరి జీవితంలో అయినా తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంతో తీపి గుర్తులుగా ఉండిపోతాయి. ఈ క్రమంలోనే తన చిన్నప్పటి ఫోటోలను ఎంతో భద్రంగా దాచుకొని పెద్దయ్యాక వాటిని చూస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనంద పడుతుంటారు. అయితే ఇలా చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకోవడంలో సెలబ్రెటీలు కూడా ముందుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హీరోయిన్లు చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ తన చిన్నప్పటి ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!                                        

యూనిఫామ్ ధరించి రెండు పిల్లలు వేసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు... కోహినూర్ సినిమా ద్వారా హీరోయిన్ పరిచయమై, నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాలో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్...నానితో కలిసి నటించిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు దక్కాయి. జెర్సీ సినిమా తర్వాత సిద్దూతో కలిసి కృష్ణ అండ్ హిస్ లీలలు అనే చిత్రంలో నటించి మరొక విజయాన్ని సొంతం చేసుకున్నారు శ్రద్ధ.

ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ మరోసారి సిద్దూ సరసన నరుడి బ్రతుకు నటన అనే సినిమాలో నటిస్తున్నారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందారు.ఈ క్రమంలోనే శ్రద్ధా శ్రీనాథ్ తన చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకోవడం వల్ల ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తన అభిమానులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: