తెలుగు చలన చిత్ర సీమలో రాణించాలంటే చాలా కష్టం అయిన పనే అని చెప్పాలి. ఎందుకంటే సినిమాల్లో మంచి పేరు, హోదా సంపాదించుకోవాలంటే చాలా కష్ట పడాలి. ఎవరి సపోర్ట్ లేకుండా  అంచెలు అంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్న మన చిరంజీవి  గారే ఇందుకు ఉదాహరణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మెగాస్టార్ పేరు చెప్పుకుని మెగా కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. అయితే మొదటగా చిరంజీవి తన తమ్ముడు అయిన నాగ బాబుని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. కానీ నాగబాబు మాత్రం సినీ ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోయాడు. ఆ తరువాత ఇంకో తమ్ముడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అయిన ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేద్దామని ఎంతో ఆరాటపడ్డాడు.


కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు కూడా ఇంట్లో చాలా ముభావంగా కుర్చీని ఉండేవాడట.పవన్ కి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉండడంతో సన్యాసం తీసుకుందామని కూడా ప్రయత్నించాడట. దీనితో తన ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయితో కలిసి సన్యాసం తీసుకుందామని శ్రీశైలంకి కూడా వెళదాం అని అనుకున్నారట. అయితే పవన్ కళ్యాణ్ యొక్క మానసిక స్థితి గమనించిన అన్నయ్య చిరంజీవి ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బయి సినిమాతో పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. కానీ ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.


ఆ సినిమాలో చేసిన మార్షల్ ఆర్ట్స్ సీన్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తరువాత ఖుషి, బద్రి, తొలిప్రేమ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యణ్ కి ఖుషి సినిమా తర్వాత అనుకున్న హిట్స్ రాకపోయినా గాని పవన్ కళ్యాణ్ క్రెజ్ మాత్రం తగ్గలేదు. అలాగే జానీ సినిమా ప్లాప్ అవటంతో తాను పారితోషకంగా తీసుకున్నా నాలుగు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసాడు. మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ సినిమాల్లో బిజిగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: