ఇస్మార్ట్ బ్యూటీ నబా నటేష్ 2018 లో "నన్ను దోచుకుందువటే" సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో సుదీర్ బాబుకు జోడీగా నటించి ఆకట్టుకుంది. అంతే కాకుండా అందం అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత వరుస ఆఫర్లతో బిజీగా మారింది. నన్ను దోచుకుందువటే సినిమా తరవాత మూడు నాలుగు సినిమాలు చేసింది. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరవాత ఇస్మార్ట్ బ్యూటీ గా పాపులర్ అయింది. అయితే టాలీవుడ్ లో నబా నటేష్ ఓ బంపరాఫర్ దక్కించుకున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సినిమాలో ఒక హీరోయిన్ గా నబా నటేష్ ను అనుకుంటున్నారట. 

ఒకవేళ ఈ బ్యూటీని సంప్రదిస్తే ఎన్టీఆర్ సినిమా కాబట్టి కచ్చితంగా ఓకే చెబుతుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరవాత జూన్ లేదా జులై లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కాబోతునట్టు సమాచారం. ఈ సినిమా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో "జనతా గ్యారేజ్" సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ ను క్లాస్ ఆడియ‌న్స్ ఆక‌ట్టుకుంది. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈసారి ఎన్టీఆర్ కు కొర‌టాల ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి మ‌రి .

మరింత సమాచారం తెలుసుకోండి: