నైన్టీస్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రజ స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ దాదాపుగా చిన్న హీరోలందరితో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ హోదా కోసం ఛానళ్లు తాపత్రయపడిన ఆమె చివరికి 2007 లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. తన స్నేహితుడు, బిజినెస్ మాన్ అయిన అబ్సర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న ఈ తెలుగు ఇంటి ఆడపడుచు చాన్నాళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. 


2014లో ఇంద్రజ లాంగ్ గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామా దిక్కులు చూడకు రామయ్య మూవీలో హీరో తల్లిగా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2014 లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి శతమానంభవతి లాంటి మంచి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో రోజా అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో  ఆమె రోజా స్థానంలో జబర్దస్త్ లో జడ్జిగా కూడా వ్యవహరించింది. తనదైన శైలిలో రోజాను మరిపిస్తూ ఆమె నవ్వుతూ పార్టిసిపంట్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. 


అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఇంద్రజ కు అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీ గురించి వివరాలు తెలుసుకోవాలంటే వికీపీడియా వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేస్తారు. కానీ ఇంద్రజకు సంబంధించిన డీటెయిల్స్ వికీపీడియా తదితర వెబ్ సైట్స్ లో తప్పుగా ఉన్నాయిట. తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్రదేశం, పెళ్ళైన రోజు ఇలా అన్నీ తప్పుగా ఉన్నాయట. వీటిని ఎలా కరెక్ట్ చేయాలో తెలియని ఆమె నెటిజెన్స్ ను సలహా అడిగింది. అలా వాళ్ళు ఇచ్చిన సలహాలకు ఆమె సంతృప్తి చెందింది. త్వరలోనే వాటిని మార్చుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: