కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వస్తూ ఉండటంతో అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైంది. పరిస్థిస్థితులు ఇలాగే కొనసాగితే జూలై ఫస్ట్ నుండి తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చేనెల నుండి ధియేటర్లు కూడ వెంటనే ఓపెన్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది.


అయితే ధియేటర్లు ఓపెన్ అయినప్పటికీ సినిమా హాల్స్ సీటింగ్ విషయంలో మాత్రం కొన్ని నెలల పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ విధానం మళ్ళీ అమలులోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న సుమారు 30 మీడియం రేంజ్ చిన్న సినిమాలు తమ సినిమాలను ఓటీటీ లలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్.


నిర్మాతలు చేస్తున్న ఈ రాయబారాలకు అనేక ఓటీటీ సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ ఆ సంస్థల ప్రతినిధులు నిర్మాతలతో గీసిగీసి ఆడుతున్న బేరాలకు చాలామంది నిర్మాతలు తలలు పట్టుకుంటున్నట్లు టాక్. దీనికితోడు ఈవిషయంలో కొంతమంది మధ్యవర్తులు కూడ ఎంటర్ కావడంతో ఆ మధ్యవర్తులకు సంబంధించిన కమీషన్లు కూడ పెరిగిపోవడంతో ఇన్ని కష్టాలుపడి ఓటీటీ లలో తమ సినిమాలను విడుదల చేసుకునే కంటే కాస్త వేచి చూసి సరైన డేట్స్ దొరికినప్పుడే తమ సినిమాలను విడుదల చేసుకోవడం మంచిది అన్న అభిప్రాయంలో టాలీవుడ్ నిర్మాత చాలామంది ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


దీనికితోడు మీడియం రేంజ్ సినిమాల హీరోలు అదేవిధంగా చిన్న సినిమాల హీరోలు కూడ తమ సినిమాలు ఓటీటీ లో విడుదల చేస్తే తామంతా ఓటీటీ హీరోలుగా మారే ప్రమాదం ఉంది అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో అటు హీరోలను ఇటు ఓటీటీ సంస్థలను మధ్యలో మీడియేటర్స్ ను మేనేజ్ చేసుకునే కంటే ధైర్యం చేసి ధియేటర్లలోకి విడుదల చేస్తే తమ సినిమాలు ఖచ్చితంగా ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ సినిమాలు లా విజయాలు సాదిస్థాయి అని ఎవరికి వారే తమతమ స్థాయిలలో కలలు కంటున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: