తెలుగులో మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ గా ప్రారంభమైన ఆహా తెలుగు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి అనేక తంటాలు పడుతోంది. ఒకపక్క ఎక్స్క్లూజివ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తూనే మరోపక్క ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను కొని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.. అల్లు అర్జున్ కి మలయాళ నాట ఉన్న క్రేజ్ ని వాడుకుంటూ అక్కడి నిర్మాతలతో తక్కువ రేట్లకే డబ్బింగ్ హక్కులు కొనేసి ఆహా వేదికగా రిలీజ్ చేసుకుంటున్నారు.. అలాగే ఇప్పటికీ తెలుగులో ఉన్న బడా దర్శకులతో వరుసగా సిరీస్ నిర్మించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.


 ఆహా వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక ఈవెంట్ లో ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా స్వయంగా ప్రస్తావించారు కూడా. ఆ సమయంలోనే హరీష్ శంకర్ సహా కొంతమంది దర్శకులు ఆహా కోసం పని చేస్తారని ఆయన వెల్లడించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆహా కోసం హరీష్ శంకర్ నేరుగా పని చేయటం లేదని కేవలం ఒక సిరీస్ ని ఆయన సమర్పించనున్నారు అని అంటున్నారు. గ్రీకువీరుడు, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దశరథ్ ఒక సిరీస్ కు కధ అందించినట్లు తెలుస్తోంది.


ఆ కథను సిరీస్ గా మలచడానికి మరో యంగ్ డైరెక్టర్ ని ఆహా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారని తెలుస్తోంది. కేవలం హరీష్ శంకర్  పేరు వాడుకునేందుకు మాత్రమే ఈ సిరీస్ విషయంలో పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మరో వాదన ప్రకారం హరీష్ శంకర్ సమర్పిస్తూనే ఈ కథ ఆయనే సెలక్ట్ చేశారని దశరద్ అందించిన కధ నచ్చడంతో ఒక కుర్ర దర్శకుడికి కూడా హరీష్ శంకరే బాధ్యతలు అప్పగించారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది ఆ సిరీస్ రిలీజ్ అయితే గాని చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: