2016 వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సోగ్గాడే చిన్నినాయనా" చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అయితే అనూహ్యమైన ఘన విజయం సాధించిన ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు అనే ఒక పిల్లజమిందార్ పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో బంగార్రాజు సత్యభామ( రమ్యకృష్ణ) ను పెళ్లి చేసుకుంటారు. వారిద్దరికీ రాము అనే ఒక బాబు పుడతాడు. మరోపక్క బంగార్రాజు ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే తన తండ్రి బంగార్రాజు పోలికలతోనే రాము జన్మిస్తారు.

కాగా, ఇటువంటి స్టోరీ లైన్ తో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం లో నాగార్జున తండ్రీకొడుకుల పాత్రలను చాలా చక్కగా పోషించారు. బంగార్రాజు బాగా దూకుడుగా ఉంటాడు. అలాగే ఆయన ఆడవారితో బాగా మాట్లాడుతూ వారి మనసులను దోచేస్తుంటాడు. అతని కొడుకు రాముకి మాత్రం అమ్మాయిల అంటే చచ్చేంత భయం. అతనికి పని తప్ప మరే ఇతర విషయాలపై ఆసక్తి ఉండదు. వరల్డ్ టాప్ వైద్యుల లో ఒకరైన రాముకి బాహ్య శరీరంపై ప్రేమ అంటూ ఏమీ ఉండదు. స్కూల్ పిల్లాడి లాగా రెడీ అయ్యి పొద్దస్తమానం తన పని తాను చూసుకుంటాడు తప్పించి భార్యను కూడా పట్టించుకోడు.

అయితే ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఉండే ఈ రెండు క్యారెక్టర్లు పూర్తి విరుద్ధం కాగా.. ఆ పాత్రలను ప్రేక్షకులకు చాలా స్పష్టంగా చూపించడంలో నాగార్జున సక్సెస్ అయ్యారు. రాము పాత్రలో నాగార్జున చూపించిన అమాయకపు నటనకు అందరూ ఫిదా అయిపోయి కడుపుబ్బా నవ్వుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ బంగార్రాజు పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున్ తన మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. నాగార్జున హలో బ్రదర్ సినిమా లో అమాయకుడిగా, కొంటె వ్యక్తిగా ఎలా అద్భుత నటనను కనబరిచారో.. అదేవిధంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా లో తనదైన శైలిలో ఫెంటాస్టిక్ నటనా ప్రతిభను కనబరిచారు. ఈ రెండు సినిమాలను పరిగణలోకి తీసుకుంటే ద్విపాత్రాభినయం చేయడంలో నాగార్జున దిట్ట అని నిస్సందేహం గా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: