అమ్మ నవమాసాలు మోసి మనల్ని కంటే నాన్న మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంటాడు.నాన్న అనే పిలిచే పిలుపులో ఎంతో ఆప్యాయత ఉంది. మన అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, కుటుంబ భారాన్ని అంతా తన భుజాలపై మోస్తూ ఉంటాడు.ఎన్ని కష్టాలు వచ్చినాగాని కష్టాలు తాను అనుభవించి సుఖాలను మనకు ఇస్తాడు. అలాంటి నాన్న గురించి ఎంత చెప్పినా, ఏమి చేసిన తక్కువే అని చెప్పాలి. ఈరోజు ఫాథర్స్ డే.ఈ ఫాథర్స్ డే అనేది ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం రోజున సెలెబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నాన్నలకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మదర్స్ డే రోజున ఎలాగయితే అమ్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతామో అలాగే ఫాదర్స్ డే రోజున కూడా మీ ఫాదర్స్ కి అలాగే అభినందనలు తెలియచేయండి.ఈరోజు ఎక్కువ సేపు మీ నాన్నతో గడపండి. వీలయితే ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు ఊహ తెలిసినప్పటి నుండి మీ నాన్న మీ గురించి ఏమి చేసాడో ఒకసారి నెమరు వేసుకోండి. మీరు బుడి బుడి అడుగులు వేసేటప్పుడు పడిపోకుండా మిమ్మల్ని పట్టుకోవడం, చేయి పట్టుకుని మిమల్ని నడిపించడం, మొదటిసారి మీరు నాన్న అని పిలిచినప్పుడు మీ నాన్న ముఖంలో కనిపించిన ఆనందం, తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించి సరైన మార్గంలో పెట్టిన ఆనాటి సంగతులు ఇలా ప్రతిదీ ఒకసారి గుర్తుచేసుకోండి. ఎంతో మరుపురాని మధుర జ్ఞాపకాలు కదా అవన్నీ..

సామాన్య మనువుడి దగ్గర నుండి సెలబ్రిటీ వరకు వాళ్ళ జీవితంలో రియల్ హీరో ఎవరని ప్రశ్నిస్తే "మా నాన్నే" అని గర్వంగా చెప్తారు.హీరోయిన్ శృతి హాసన్ కూడా అనేక సార్లు తండ్రి కమల్ హాసన్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటుంది. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో ప్రతి ఒక్కరికి తెలుసు.అలాంటి గొప్ప తండ్రికి పుట్టిన శృతిహాసన్ కూడా నిజంగా అదృష్ట వంతురాలు అనే చెప్పవచ్చు.1980లో కమల్ హాసన్ నటి సారికను పెళ్లి చేసుకున్నాడు.ఇక వీరి పెళ్ళి తర్వాత 1986లో శృతిహాసన్ జన్మించింది. తరువాత అక్షర హాసన్ పుట్టనది. కొంత కాలం పాటు తమ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుండగా కొన్ని వ్యక్తిగత కారణాల వలన వీళ్ళు 2004లో విడిపోయారు.తల్లి తండ్రి విడిపోయినాగాని శృతి మాత్రం అటు అమ్మతోనూ ఇటు నాన్నతోను ఎంతో ప్రేమగా ఉండేది. తండ్రి కమల్ హాసన్ అంటే శృతికి ఎంతో గౌరవం,ప్రేమ. ఈ మధ్య తమిళనాడులో జరిగిన ఎన్నికలలో కమల్ హాసన్ సొంత పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.


అందరూ కమల్ ఓడిపోయారని అంటే శృతి మాత్రం"గెలిచినా.. ఓడినా ఎప్పుడూ త‌న తండ్రిని చూసి గ‌ర్వ‌ప‌డుతూనే ఉంటాన‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలాగానే చేశారు. "Always So Proud of My Appa" అంటూ తన తండ్రి మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన శృతి మొదట్లో ఆశించినంత ఫలితాలు రాకపోయినా తరువాత తన నటనతో నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.ఒక గొప్ప నటుడికి  కూతురుగా అయినందుకు శృతి హాసన్ ఎంత గర్వపడుతుందో అలాగే శృతి లాంటి టాలెంటెడ్ కూతురు తనకి కూతురు అయినందుకు కమల్ హాసన్ కూడా అంతే గర్వ పడుతున్నారు. ఏది ఏమయినా ఈ తండ్రి కూతుళ్ళ అనుబంధం చూసి అభిమానులు సైతం గర్వపడుతున్నారు. !

మరింత సమాచారం తెలుసుకోండి: