పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మధురమైన క్షణం. ఈ అనుభూతిని శాశ్వతంగా నిలుపుకోవడానికి, ప్రతి ఒక్కరు వారికి ఉన్నంతలోనే ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. రంగురంగుల దుస్తులు ధరించి, ఆకర్షణీయమైన ఆభరణాలతో అందంగా ముస్తాబవుతూ, పెళ్లి పీటల మీద కూర్చొని, ఏడు అడుగులు వేస్తూ ఉంటారు వధూవరులు. అయితే ఇలాంటి పెళ్లి వేడుకలను సామాన్యులు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటే, మరి సెలబ్రిటీల విషయానికి వస్తే, ఇక అది మాటల్లో చెప్పలేనిది. వీరు వీరి పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో కూడా తెలియని పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే సినీ హీరోయిన్ లు తమ పెళ్లిలో ధరించిన దుస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అయితే ఎవరెవరు, వారి పెళ్లి దుస్తులకు ఎంత ఖరీదు చేశారో ఇప్పుడు చూసి తెలుసుకుందాం.


1. నిహారిక కొణిదెల:మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. ఈమెకు  2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ వెంకట చైతన్య తో వివాహం జరిగింది. ఈ వేడుకలో నిహారిక ధరించిన చీర విషయానికి వస్తే, సుమారు ఏడున్నర లక్షల రూపాయల ఖరీదు చేస్తుందట. దీనిని గుజరాత్ కి చెందిన సహేలి డిజైనర్స్  తయారు చేశారట. దీనిని బంగారు పూత రేకుతో చేయించారని, ఇక బార్డర్స్ ని దాదాపు 20 రోజుల పాటు తయారు చేసి, ఇంత అద్భుతమైన చీరను  రూపొందించారు.


2. ఐశ్వర్యరాయ్:మిస్ ఇంటర్నేషనల్  గా మెరిసిన ఐశ్వర్య రాయ్ కి 2007వ సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ తో వివాహం జరిగింది. అయితే వీరు ప్రేమించుకుని, సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్య తన పెళ్ళికి కట్టుకున్న చీర ధర రూ.75 లక్షలు. దీనిని నీతూ లుల్లా అనే డిజైనర్ డిజైన్ చేసిన కాంజీవరం చీర ఇది. దీనిని బంగారు తీగలతో రూపొందించారు.

3. అనుష్క శర్మ:టీమిండియా కెప్టెన్ తో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కి  2017 లో వివాహం జరిగింది. అనుష్క శర్మ తన పెళ్ళికి కట్టుకున్న చీరను సవ్యసాచి అనే డిజైనర్ రూపొందించారు. దీని ధర రూ. 30 లక్షల రూపాయలు.


4. సోనం కపూర్:సోనం కపూర్  తన ప్రియుడు ఆనందర్ ఆహుజా ని 2018 లో వివాహం చేసుకుంది. అయితే ఈమె తన పెళ్ళికి కట్టుకున్న చీర ధర రూ. 70 లక్షలు. దీనిని అనురాధ వకీల్ అనే డిజైనర్ రూపొందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: