శ్రీను అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సినిమా నారప్ప. ఈ సినిమాని తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చూపించారు. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకొని ధనుష్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిది. అయితే ఈ సినిమాను తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాడవం చేయడంతో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. చివరికి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఓటిటిని ఎంచుకున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయి, సర్వత్రా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  నారప్ప సినిమాపై టాలీవూడ్ నటులు అందరు వారి స్పందనని తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా నారప్ప సినిమాపై స్పందించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నట విశ్వరూపం పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక కంగ్రాట్స్ వెంకీ , నారప్ప ఇప్పుడే చూసాను, ఆ నటన, ఆ ట్రాన్స్ ఫామేశన్ వావ్ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇక సినిమాలో ఎక్కడా వెంకటేష్ కనబడలేదు అని, నారప్ప కనిపించాడు అంటూ ఆయన అన్నారు.



అయితే మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ ను చూసినట్లు వెల్లడించారు. కాగా.. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొనే, చాలా డెప్త్ కి వెళ్లి నటించావని పేర్కొన్నారు. ఇక నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు అని వ్యాఖ్యానించారు చిరంజీవి. అంతేకాదు.. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా మంచి పేరుతో పాటుగా, కెరీర్ లో గర్వంగా చెప్పుకొనే చిత్రం అని పేర్కొన్నారు. ఇక చిరు చేసిన వ్యాఖ్యల పట్ల వెంకటేష్ సంతోషం వ్యక్త పరిచారు. చిరంజీవి మాట్లాడిన ప్రతి మాట మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని వెంకటేష్ అన్నారు. ఇక చిరంజీవికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు వెంకీ.

మరింత సమాచారం తెలుసుకోండి: