స్టార్ హీరో బర్త్ డే అయితే ఫ్యాన్స్ చేసే హంగామానే కాదు అభిమానుల కోసం స్టార్స్ కూడా కానుకలు అందిస్తుంటారు. ఈ క్రమంలో రాబోతున్న ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊహించని రెండు క్రేజీ గిఫ్ట్ లతో వస్తున్నారని తెలుస్తుంది. అందులో ఒకటి ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట సినిమా నుండి టీజర్ ఒకటి రిలీజ్ చేస్తారని అంటున్నారు. పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట మూవీ నుండి టీజర్ తోనే స్పెషల్ క్రేజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక బర్త్ డే ఇది కాకుండా మరో రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఆల్రెడీ ఎనౌన్స్ మెంట్ రాగా మహేష్ బర్త్ డే నాడు సినిమాకు సంబందించిన కీలక అప్డేట్ అది టైటిల్ పోస్టర్ కావొచ్చు.. లేదా ఫుల్ కాస్ట్ అండ్ క్రూ అయినా ఎనౌన్స్ చేయొచ్చని అటున్నారు. ఇక ఇదే కాకుండా రాజమౌళి సినిమాకు ముందు మరో సినిమా చేయాలనుకున్న మహేష్ సరిలేరు డైరక్టర్ అనీల్ రావిపుడితో మరో సినిమా చేస్తాడని అంటున్నారు.

మహేష్ బర్త్ డే రోజు అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమాకు సంబందించి కూడా ఒక క్రేజీ అప్డేట్ వస్తుందని అంటున్నారు. సర్కారు వారి పాట టీజర్ తో పాటుగా త్రివిక్రం, అనీల్ రావిపుడి రెండు సినిమాల అప్డేట్ తో ఫ్యాన్స్ ను స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట మహేష్. కచ్చితంగా మహేష్ అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. రాజమౌళి మూవీకి సంబందించిన అప్డేట్ కూడా మహేష్ బర్త్ డే నాడు వస్తుద్నని ఫిల్మ్ నగర్ టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: