రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా దీనిని ఈ ఏడాది చివరలో విడుదల చేసేలా యూనిట్ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, అలానే ఓం రౌత్ తీస్తున్న ఆదిపురుష్ సినిమాలు కూడా చేస్తున్నారు ప్రభాస్. అలానే మూడు రోజుల క్రితం నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది.
ఇక ఈ సినిమాకి సంబందించి ప్రస్తుతం జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకత కలిగించే ఆసక్తికర అంశాలు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 50వ ప్రాజక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది. వాస్తవానికి భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ నుండి తెరకెక్కుతుండటం పెద్ద ప్రత్యేకత. ముఖ్యంగా తొలిసారిగా అమితాబ్ పూర్తి స్థాయి నిడివి గల రోల్ ని టాలీవుడ్ సినిమాలో పోషించడం విశేషం. అలానే ఈ సినిమా ద్వారా దీపికా పదుకొనె టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా కథని టైం ట్రావెల్ నేపథ్యంలో చిత్రీకరిస్తుండడంతో పాటు సినిమాలోని పలు కీలక సన్నివేశాల కోసం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ని హాలీవుడ్ లోని పలు బడా సినిమాలకు పని చేసిన టెక్నీకల్ టీమ్ తో పని చేయించనున్నారట.
వీటితో పాటు ఇప్పటికే ఈ మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీ లో దాదాపుగా రూ.50 కోట్లతో ఒక భారీ అధునాత సైన్స్ లాబరేటరీ సెట్ ని రూపొందించారని, సినిమాలోని చాలా సీన్స్ షూట్ అందులోనే జరగనుందని టాక్. అన్నిటికంటే ముఖ్యంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ అధినేత సి అశ్విని దత్ ఈ మూవీ కోసం ఏకంగా రూ.700 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నారని, యావత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని టాక్. మొత్తంగా ఇన్ని ప్రత్యేకమైన ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ప్రాజక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసేలా దర్శకనిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: