వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా తెలుగులో ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఫ్యామిలీ కం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరిలో ఎంతగానో ఆసక్తిని కలిగించిన చిత్రంగా నిలిచింది మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేయగా పలు భాషలలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. మలయాళంలో మోహన్ లాల్ తమిళంలో కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం రెండవ భాగం కూడా ఇటీవలే మలయాళంలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగులో హీరోగా ఇప్పటికే తెరకెక్కించడం జరిగింది. మంచి సమయం చూసుకొని ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోండగా దసరాకు పెద్ద సినిమాలేవీ రాకపోతే దీనిని విడుదల చేసే ఆలోచన కూడా చేస్తుంది. వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఇటీవలే ఓ టి టి లో విడుదలవ్వగా ఈ చిత్రం కూడా ఓటీటీ లోనే విడుదల అవుతుందని చాలా వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులు వస్తుండడంతో చిత్రబృందం ఆ ఆలోచనను మార్చుకునే థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 

ఈ నేపథ్యంలోనే మలయాళంలో చాలా రోజుల క్రితం విడుదలైన దృశ్యం రెండవ భాగం అక్కడ కొన్ని సెన్సేషనల్ రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికీ ఆ రికార్డులను కొనసాగిస్తున్న దృశ్యం సినిమా తాజాగా మరొక సెన్సేషనల్ రికార్డును సాధించింది. భారతదేశంలో అనేక భాషల్లో రీమేక్ అయిన ఈ చిత్రం విదేశీ భాషలో కూడా రీమేక్ కావడం విశేషం. ఇప్పటికే తొలి భాగం రెండు విదేశీ భాషలలో రీమేక్ కాగా ఇప్పుడు రెండవ భాగం కూడా విదేశీ భాషల్లో రీమేక్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గొప్ప చిత్రంగా సూపర్ హిట్ చిత్రంగా నిలిచిపోతుంది. మరి ఈ సినిమా నుంచి మూడో భాగం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: