ఇటీవల వకీల్ సాబ్ తో భారీ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతంమలయాళ అయ్యప్పనున్ కోషియం రీమేక్ అయిన 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా మరో హీరోగ్ కనిపించనున్నాడు. సాగర్ కె.చంద్ర ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తుండగా..త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల టీజర్లు సినిమా పై అంచనాలు పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్,ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

మిగిలిన నాన్ థియేటర్ హక్కులు అంటే శాటిలైట్, డిజిటల్ కోసం 70 కోట్ల రేంజ్ లో బేరాలు జరుగుతున్నాయని అంటున్నారు.ఇక సినిమా టికెట్ రేట్లు, ఆక్యుపెన్సి ఇలా అన్నీ కూడా సజావుగా ఉంటే..తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి సుమారు 80 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ అవుతుంది.అంటే సినిమా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా టర్నోవర్ మొత్తం 170 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.ఇక ఇప్పుడు ఆ రేంజ్ మొత్తం వస్తే..ఈ సినిమాను ఓటిటికి ఇవ్వడానికి నిర్మాత సూర్య దేవర నాగవంశీ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు పూర్తి సముఖంగా ఉన్నారనీ తెలుస్తోంది.అంతేకాదు ఇప్పటికే బేరాలు కూడా అయిపోయిందనే టాక్ ఇప్పుడు ఇండ్రస్టీ లో బలంగా వినిపిస్తోంది.

ఒక వేళ ఇదే కనుక జరిగితే ఓటిటిలో కొన్ని వందల కోట్ల రేంజ్ లో జరిగిన తొలి ఓటీటీ డీల్ ఇదే అవుతుంది.ఇక ఈ సినిమా మాత్రమే కాదు క్రిష్ హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాల నిర్మాతలను పిలిచి..మీకు నచ్చి కుదిరితే ఓటిటికి వెళ్ళండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పాడట.మరి నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా ఓటిటిలో రిలీజ్ అయితే ఆయన అభిమానులు తట్టుకోగలరా అనేది సందేహంగా మారింది.ఎందుకంటే పవన్ ని వెండితెరపై చూడాలని అభిమానులు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారు.ఇక ఆయన సినిమా విడుదల రోజును ఒక పండగలా భావిస్తారు. అలాంటిది థియేటర్ లో కాకుండా ఓటిటిలో రిలీజ్ అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: