టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న  క్రేజీ మల్టీస్టారర్ సినిమాల్లో 'భీమ్లా నాయక్' సినిమా కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరు మొదటిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక యువ దర్శకుడు సాగర్ కేంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ పై పలు సందేహాలు వస్తున్నాయి.

 జనవరి 12 న విడుదల చేస్తున్నామని మేకర్ చెప్పినా ఆర్ఆర్ఆర్ నిర్మాతలు మాత్రం పవన్ ను ఎలాగైనా ఒప్పించి సినిమా విడుదల వాయిదా వేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన మరో టీజర్ ను దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారట. డిసెంబర్ 14వ తేదీ న రానా పుట్టినరోజు. ఆ రోజు ఈ సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేసేలా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ని జనవరి మొదటి వారంలో ఒకటవ తేదీన లేక జనవరి 5వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 దీంతో ఈ సినిమా ట్రైలర్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళంలో హిట్టయిన అయ్యప్పన్ కోషియం అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఇక సినిమాలో భీమ్లా నాయక్ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. డేనియల్ శేఖర్ అనే పాత్రలో దగ్గుబాటి రానా కనిపించనున్నాడు. ఓ పోలీస్ ఆఫీసర్ మరియు రిటైర్డ్ ఆర్మీ కి మధ్య ఈగో క్లాషెష్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: