అక్షరాన్ని అందలం ఎక్కించి పాటను గంగా ప్రవాహంలా పరవళ్ళు తొక్కించిన గొప్ప పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఏ క్షణాన తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఆయన కలం పట్టుకున్నారో కానీ ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో కీర్తిని గడించాయి. ఎంతోమంది శ్రోతలను అలరించాయి. ఆయన పాటలో ప్రేమ ఆయన పాటలో విప్లవం ఆయన పాటలో జీవిత సత్యం చెప్పుకుంటూపోతే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ప్రతి పాటలో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది అని చెప్పాలి.. ఇలా ఎన్నో గొప్ప పాటలను రాసి తెలుగు చిత్రపరిశ్రమకు ముద్దుబిడ్డ గా మారిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.


 ఆయన హఠాత్ మరణం మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. వేటూరి మరణం తర్వాత చిత్ర పరిశ్రమకు అండగా ఉంటారు అనుకున్నా సిరివెన్నెల కూడా కన్నుమూయడంతో ప్రస్తుతం అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సిరివెన్నెల మరణం పై స్పందిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సిరివెన్నెల మరణంపై స్పందించారు.


"తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని  తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని.

శ్రీ సీతారామశాస్త్రి గారు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.

శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." ప్రగాఢ సానుభూతి తెలిపారు.


 సిరివెన్నెల మరణంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి.


"నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
మిత్రమా. " వి మిస్ యు అంటూ సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: