తెలుగువారి లోగిళ్ల‌లో పెద్ద పండ‌గకు పండ‌గ‌లాంటి సినిమా అని తెగ ఊద‌ర‌గొట్టాడు నాగ్..అదేవిధంగా అంతే స్థాయిలో ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ అన్నీ త‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చిన అన్న‌పూర్ణ స్టూడియో కాంపౌండ్ నుంచే చేసుకుని వ‌చ్చాడు.రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి మ్యూజిక‌ల్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వ‌ర‌కూ అన్నీ అన్నీ నాగ్ ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు.ఓ విధంగా బంగార్రాజు సినిమా అన్న‌ది నాగ్ ఒన్ మ్యాన్  షో! సినిమాలో చై ఉన్నా కూడా నాగ్ మాత్ర‌మే చేయ‌గ‌లిగిన పెర్ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టాడు.కానీ కొన్ని  త‌ప్పిదాల కార‌ణంగా ఈ సినిమాకు రావాల్సినంత బ‌జ్ రాలేదు. ఇండ‌స్ట్రీ స‌పోర్ట్ కూడా ఈ సినిమాకు పెద్ద‌గా లేదు. సినిమా విడుద‌ల‌కు ముందు జ‌గ‌న్ కు మ‌ద్దతుగా (ప‌రోక్షంగా త‌న‌కేం కాదు అన్న ప‌ద్ధ‌తిలో) ఆయ‌న చేసిన కామెంట్లే సినిమా కలెక్ష‌న్ గ్రాఫ్ పెద్ద‌గా ఆశించిన రీతిలో లేక‌పోవ‌డానికి ఓ కార‌ణం కావొచ్చు అని విశ్లేష‌కుల మాట.

బంగార్రాజు సినిమా ఓవ‌ర్సీస్ లో అనుకున్నంత ఫ‌లితాలయితే సాధించ‌లేక‌పోయింది. ఫ‌స్ట్ డే అక్క‌డ న‌లభై వేల డాల‌ర్ల‌ను సొంతం చేసుకుని నిరాశ ప‌ర్చింది.యావ‌రేజ్ ఓపెనింగ్స్ తో ఈ సినిమా నిర్మాత‌ల‌ను డైల‌మాలో ప‌డేసింది.వాస్త‌వానికి అఖండ సినిమాతో పోలిస్తే ఈ సినిమా ఫ‌లితం క‌లెక్ష‌న్ల ప‌రంగా ఏమీ బాలేద‌నే చెప్పాలి.అక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం 8.75కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. ఇదంతా ఓ అంచ‌నా అనుసారం తేలిన లెక్క.


అఖండ సినిమాను అదుకున్న‌దే ఓవ‌ర్సీస్ మార్కెట్.ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమా మంచి వసూళ్ల‌ను సాధించ‌లేక‌పోయింది.ఓవ‌ర్సీస్ ప‌రంగా ముందునుంచి
ఈ సినిమాకు అంత హైప్ లేదు. వాస్త‌వానికి నాగ్ సినిమాల‌కు పెద్ద‌గా ఓవ‌ర్సీస్ మార్కెట్ ఉండ‌ద‌నే అంటుంటారు.బాల‌య్య‌తో పోలిస్తే ఓవ‌ర్సీస్ మార్కెట్ కు నాగ్ కు ఈ సారి బాగా త‌గ్గిపోయింది. సినిమా కు పెద్ద‌గా అంచ‌నాలు కూడా లేక‌పోవ‌డం ఓ మైన‌స్.


అఖండ రేర్ కాంబో కాక‌పోయినా హిట్ కాంబో..ఆ విధంగా చూసుకుంటే ఇది కూడా హిట్ కాంబోనే కానీ డైరెక్ట‌ర్ ప‌రంగా ఉన్న ఇమేజ్ క‌ల్యాణ్ కృష్ణ కు చాలా త‌క్కువ.అదే బోయ‌పాటి విష‌యానికి వ‌స్తే ఆయ‌న సూప‌ర్ మాస్..ఈయ‌న ప‌క్కా క్లాస్.కల్యాణ్ కృష్ణ పెద్ద‌గా మాట్లాడ‌డు కూడా! సినిమా విష‌య‌మై లేనిపోని అంచ‌నాలు పెంచుకోవ‌ద్ద‌ని ఒక‌టికి వంద‌సార్లు అంటుంటాడు కూడా! కానీ నాగ్ మాత్రం కాస్త అతి మాట‌లే చెప్పాడు.మీరంతా మీసం మెలేసుకునేలానే ఈ సినిమా ఉంటుంద‌ని అన్నాడు. కానీ అది నిజం కాద‌ని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: