న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే ఒక హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే మరో సినిమాని కంప్లీట్ చేసాడు. ఇది కూడా సరి కొత్త కథ తో ప్రేక్షకుల ముందుగా రానుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. శ్యామ్ సింగరాయ్ విజయంతో దూసుకుపోతున్నాడు. గత నెల లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.


సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సినిమా అంచనాలను పెంచేసింది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఒక వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. షూటింగ్ సెట్స్ లో అంటే సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు నాని. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నాని.. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..


ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తీ అయినట్లు నాని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా ను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఆ సినిమా ఎప్పుడూ సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: