టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ నటులుగా దూసుకెళ్తున్న వారిలో ఎన్టీఆర్, చరణ్ కూడా ముందు వరుసలో ఉంటారు. చిరుత మూవీతో చరణ్, అలానే నిన్ను చూడాలని మూవీతో ఎన్టీఆర్ టాలీవుడ్ కి హీరోలుగా పరిచయం అయ్యారు. ఇక అక్కడి నుండి ఒక్కో సినిమాతో హీరోలుగా పలు సక్సెస్ లు సొంతం చేసుకుంటూ తమదైన ఆకట్టుకుంటే యాక్టింగ్ టాలెంట్ తో ఎందరో ప్రేక్షకాభిమానుల హృదయాలు గెలుచుకున్న ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం తొలిసారిగా కలిసి పని చేసిన సినిమా ఆర్ఆర్ఆర్.
జక్కన్న రాజమౌళి తీసిన ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. మార్చి 18 న లేదా ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా పేట్రియాటిక్ డ్రామా మూవీగా కొంత కల్పిత కథగా భారీ యాక్షన్ కమర్షియల్ హంగులతో తెరకెక్కినట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలో కరోనా పరిస్థితులు లేకపోతె ఈ నెల 7న ఆర్ఆర్ఆర్ థియేటర్స్ లోకి వచ్చి ఉండేది. అయితే ఇటీవల లేటెస్ట్ గా ప్రకటించిన రెండు డేట్స్ లో ఏదో ఒక రోజున ఆర్ఆర్ఆర్ పక్కాగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటోంది యూనిట్.

అయితే ఇంతకముందు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ స్టైల్ లో ప్లాన్ చేసిన ఆర్ఆర్ ఆర్ యూనిట్, దీనికి ప్రత్యేక గెస్టులుగా చిరు, బాలయ్యలని పిలవడంతో పాటు ఒక విభిన్నమైన స్కిట్ ని ఏర్పాటు చేసి అందులో భాగంగా ఎన్టీఆర్ కి చిరు, చరణ్ కి బాలయ్య మద్దతు పలికేలా మాట్లాడించాలని సరదాగా ప్లాన్ చేశారట. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మార్చి మొదటి వారంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందని, అలానే గతంలో తాము అనుకున్న విధంగానే చిరు, బాలయ్యలని ఈవెంట్ కి గెస్ట్ లు గా పిలిచి యధాతధంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో వేడుకని నిర్వహించాలని ఆర్ఆర్ఆర్ భావిస్తోందట. మరి ఇదే కనుక నిజం అయితే ఆర్ఆర్ ఆర్ మూవీ ఫ్యాన్స్ తో పాటు యావత్ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీనులవిందు చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: