గత సంవత్సరం సాయి ధరమ్ తేజ్ కు జరిగిన బైక్ యాక్సిడెంట్ నుండి తేరుకుని తిరిగి సినిమాలలోకి రావడానికి మెగా మేనల్లుడుకి చాల సమయం పట్టింది. ప్రస్తుతం తన అనారోగ్యం నుండి కోలుకున్న ఈ యంగ్ హీరో వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించబోయే ‘వినోదయ శితం’ మూవీ రీమేక్ లో సాయి తేజ్ పవన్ తో కలిసి నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై తేజ్ చాల ఆశలు పెట్టుకున్నాడు.


సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ స్క్రిప్ట్ అంతా త్రివిక్రమ్ వ్రాయడమే కాకుండా ఈసినిమాకు మాటల మాంత్రికుడు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈమూవీలో కూడ త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపిస్తుంది అన్న అంచనాలతో ఉన్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ స్క్రిప్ట్ లో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ను యధాతదంగా చూపించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.


అయితే ‘వినోదయ శితం’ మూవీలో హీరో మధ్య వయస్కుడు. ఈ తమిళ సినిమాలో హీరో కారు యాక్సిడెంట్ లో చనిపోతే అతడిని బతికించడానికి అదృశ్య శక్తులు ఉన్న ఒక వ్యక్తి వస్తాడు. అతడి మాటలు చేతలు భగవంతుడుని పోలి ఉంటాయి. ఇప్పుడు పవన్ తో తీయబోతున్న ఈ రీమేక్ లో సాయి తేజ్ ను 30 సంవత్సరాల యువకుడు గా చూపెడుతూ కారు యాక్సిడెంట్ కు బదులు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్లు టాక్.


యాక్సిడెంట్ అయిన వెంటనే పవన్ భగవంతుడు రూపంలో వచ్చి సాయి తేజ్ ని బతికిస్తాడట. సాయి తేజ్ యాక్సిడెంట్ సీన్ ను యదాతదంగా చూపెడితే జనం బాగా చూస్తారు అన్న ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈమూవీలో తేజ్ పక్కన నటించే అవకాశం ఒక మళయాళ నాటికీ వచ్చినట్లు టాక్. ‘భీమ్లా నాయక్’ మూవీలో నటించిన సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా నటించే అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది..
మరింత సమాచారం తెలుసుకోండి: