విలక్షణ నటుడు మోహన్ బాబు తన మనసులో ఏది ఉంటే అది వెంటనే మాట్లాడుతాడు. దీనివల్ల ఆయనకు ఎన్నో నష్టాలు వచ్చాయని స్వయంగా అనేకసార్లు చెప్పాడు. ఈమధ్య తిరుపతిలోని కోర్టుకు ఒక కేసుకు సంబంధించి వచ్చిన సందర్భంగా తనను కలిసిన మీడియా వాళ్ళతో మోహన్ బాబు వర్తమాన రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో కూడ గెలుపొంది మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవ్వాలని తాను మనసారా కోరుకుంటున్నాను అంటూ ఎప్పటికైనా తాను బిజేపీ మనిషినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. గతంలో మోహన్ బాబు భారతీయ జనతాపార్టీలో కొంతకాలం కొనసాగాడు. అయితే ఆతరువాత అతడు ఆపార్టీకి దూరం అయ్యాడు.గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మోహన్ బాబు వైసీపి పార్టీ కోసం విపరీతంగా ప్రచారం చేసాడు. అంతేకాదు చంద్రబాబు ఓడిపోవడం తధ్యం అని చెపుతూ అమరావతిలో పోటీ చేసిన లోకేష్ కు వ్యతిరేకంగా అమరావతిలో ఘాటైన ప్రసంగం కూడ చేసాడు. వైసీపి అధికారంలోకి రాగానే మోహన్ బాబుకు రాజ్యసభ సభ్యత్వం కానీ లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కానీ వస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే అలా జరగకపోవడంతో చాలామంది ఆశ్చర్య పడ్డారు. వాస్తవానికి మంచు విష్ణుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరసకు బావ అవుతారు. అయితే మోహన్ బాబుకు ఎటువంటి అధికారిక పదవి రాకపోవడంతో చాలామంది షాక్ అయ్యారు.


ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు తాను భారతీయ జనతా పార్టీ మనిషిని అని ఓపెన్ గా చెప్పడంతో రానున్న ఎన్నికలలో మోహన్ బాబు తిరుపతి పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తాడా అన్న ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. అయితే ఇప్పటికే మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుండి బిజేపీ కి ఆతరువాత వైసీపి కి అడుగులు వేసిన పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబుకు ఎంతవరకు ప్రాధాన్యత లభిస్తుంది అన్నది వేచి చూడాలి..  
మరింత సమాచారం తెలుసుకోండి: